తూర్పుగోదావరిలో కరోనా జోరు: ఏపీలో 1,66, 585కి చేరిన కేసులు

Published : Aug 03, 2020, 07:24 PM ISTUpdated : Aug 03, 2020, 07:29 PM IST
తూర్పుగోదావరిలో కరోనా జోరు: ఏపీలో 1,66, 585కి చేరిన కేసులు

సారాంశం

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా జోరు కొనసాగుతోంది. 24 గంటల్లో ఈ జిల్లాలో 1113 కేసులు నమోదయ్యాయి.ఆ తర్వాతి స్థానంలో విశాఖపట్టణం జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 1049 కేసులు రికార్డయ్యాయి.రాష్ట్రంలో కరోనా కేసుల్లో తూర్పు గోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో కరోనా జోరు కొనసాగుతోంది. 24 గంటల్లో ఈ జిల్లాలో 1113 కేసులు నమోదయ్యాయి.ఆ తర్వాతి స్థానంలో విశాఖపట్టణం జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 1049 కేసులు రికార్డయ్యాయి.రాష్ట్రంలో కరోనా కేసుల్లో తూర్పు గోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 23314కి చేరుకొన్నాయి.

రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 7822 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో 63 మంది మరణించారు.రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,66,586కి చేరుకొంది. రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 1537కి చేరుకొంది.

గత 24 గంటల్లో అనంతపురంలో 953, కర్నూల్ లో 240, తూర్పుగోదావరిలో 1113, గుంటూరులో 573, కడపలో 576,కృష్ణాలో 240,కర్నూల్ లో 602, నెల్లూరులో 500, ప్రకాశంలో 364, శ్రీకాకుళంలో 495, విశాఖలో 1049 , విజయనగరంలో 677, పశ్చిమ గోదావరిలో 440 కేసులు నమోదయ్యాయి.

also read:రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కి కరోనా

ఇక కరోనాతో ఒక్క రోజులోనే పశ్చిమగోదావరిలో 11 మంది, విశాఖలో 9 మంది, ప్రకాశం, నెల్లూరులో ఏడుగురి చొప్పున, విజయనగరంలో నలుగురు, చిత్తూరు, కృష్ణాలో ముగ్గురి చొప్పున, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కడపలలో ఇద్దరి చొప్పున మరణించారు.

ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు, మరణాలు

అనంతపురం- 17,476, మరణాలు 124
చిత్తూరు- 12348, మరణాలు 120
తూర్పు గోదావరి - 23314, మరణాలు 181
గుంటూరు - 16,881, మరణాలు 151
కడప - 9395, మరణాలు 49
కృష్ణా - 7819, మరణాలు 178
కర్నూల్ - 19,679, మరణాలు 210
నెల్లూరు - 8823, మరణాలు 57
ప్రకాశం - 6317, మరణాలు 77
శ్రీకాకుళం - 8012, మరణాలు 86
విశాఖపట్టణం-  14,196, మరణాలు 65
విజయనగరం - 5637, మరణాలు 65
పశ్చిమ గోదావరి -  13,794, మరణాలు 110


 

PREV
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu