భారీగా తగ్గిన కరోనా కేసులు: ఏపీలో మొత్తం 8,71,972కి చేరిక

By narsimha lodeFirst Published Dec 6, 2020, 6:02 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 0667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 71వేల 972 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 0667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 71వేల 972 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 09 మంది కరోనా మరణించారు.కరోనాతో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరేసి చనిపోయారు. అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్, కడప, నెల్లూరు, విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కరి చొప్పున  మరణించారు.రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,033 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,04,10,612 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 60,329 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 0667 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 59వేల 029 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 5,910 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.


గత 24 గంటల్లో అనంతపురంలో 037,చిత్తూరులో 105,తూర్పుగోదావరిలో 038, గుంటూరులో 114 కడపలో024, కృష్ణాలో 129, కర్నూల్ లో 008, నెల్లూరులో 024, ప్రకాశంలో 036, శ్రీకాకుళంలో 033, విశాఖపట్టణంలో 015, విజయనగరంలో 018,పశ్చిమగోదావరిలో 086కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -65,862, మరణాలు 593
చిత్తూరు  -84,266 మరణాలు 834
తూర్పుగోదావరి -1,22,650 మరణాలు 630
గుంటూరు  -73,397, మరణాలు 653
కడప  -54,509,మరణాలు 452
కృష్ణా  -46,121 మరణాలు 647
కర్నూల్  -60,295 మరణాలు 487
నెల్లూరు -61,610, మరణాలు 499
ప్రకాశం -61,629 మరణాలు 578
శ్రీకాకుళం -45,570 మరణాలు 3464
విశాఖపట్టణం  -58,438 మరణాలు 544
విజయనగరం  -40,784 మరణాలు 237
పశ్చిమగోదావరి -92,946 మరణాలు 527

: 06/12/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,69,077 పాజిటివ్ కేసు లకు గాను
*8,56,134 మంది డిశ్చార్జ్ కాగా
*7,033 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,910 pic.twitter.com/z9nEXpWmeQ

— ArogyaAndhra (@ArogyaAndhra)


 

click me!