ఏలూరులో వింత వ్యాధి: బెజవాడకు చేరుకున్న శాంపిల్స్

By Siva KodatiFirst Published Dec 6, 2020, 5:19 PM IST
Highlights

ఏలూరులో వింత వ్యాధి కారణాలపై నిపుణులు విశ్లేషిస్తున్నారు విజయవాడలోని ల్యాబ్‌లకు 24 శాంపిళ్లు పంపారు. బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించారు అధికారులు. 

ఏలూరులో వింత వ్యాధి కారణాలపై నిపుణులు విశ్లేషిస్తున్నారు విజయవాడలోని ల్యాబ్‌లకు 24 శాంపిళ్లు పంపారు. బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించారు అధికారులు. వారి వెన్నెముక నుంచి కూడా శాంపిళ్లను సేకరించారు.

ఇప్పటి వరకు వచ్చిన రిపోర్టులన్నీ సాధారణంగానే ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. మరిన్ని ఆధారాలు, నమూనాల సేకరణ కోసం నిపుణుల బృందం ఏలూరుకు వెళ్లింది. 

మరోవైపు ఏలూరులో చిన్నారులు అస్వస్థతకు గురికావడంపై గవర్నర్ హరిచందన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరులో స్థానిక పరిస్థితులపై గవర్నర్‌ ఆరా తీశారు.

వైద్య, ఆరోగ్యశాఖ మరింత వేగవంత చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

సమస్యకు కారణం ఏమిటన్న దానిపై నిపుణుల సలహాలు తీసుకోవాలని, వైద్య ఆరోగ్యశాఖను గవర్నర్‌ హరిచందన్ ఆదేశించారు

click me!