ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 6341 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 18లక్షల 39 వేల 243కి చేరుకొన్నాయి.కరోనాతో ఒక్క రోజులోనే 57 మంది మరణించారు.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 6341 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 18లక్షల 39 వేల 243కి చేరుకొన్నాయి.కరోనాతో ఒక్క రోజులోనే 57 మంది మరణించారు. గత 24 గంటల్లో అనంతపురంలో 316 చిత్తూరులో 919, తూర్పుగోదావరిలో1247, గుంటూరులో353, కడపలో378, కృష్ణాలో461, కర్నూల్ లో266, నెల్లూరులో 295, ప్రకాశంలో 453,విశాఖపట్టణంలో 299, శ్రీకాకుళంలో372, విజయనగరంలో 191, పశ్చిమగోదావరిలో 791 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో57 మంది కరోనాతో మరణించారు. చిత్తూరులో 12 మంది,గుంటూరులో ఎనిమిది మంది, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆరుగురు చొప్పున ఆరుగురి చొప్పున చనిపోయారు. శ్రీకాకుళంలో ఐదుగురు, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్టణం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురి చొప్పున కరోనాతో మరణించారు. కర్నూల్, విజయనగరంలలో ఇద్దరు చనిపోయారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 12,224మంది చనిపోయారు.
గత 24 గంటల్లో 1,07,764 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 6,341 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. గత 24 గంటల్లో కరోనా నుండి 8,486 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుండి 18,39,243 మంది కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు2,09,46,911 మంది నుండి శాంపిల్స్ సేకరించారు. ఇప్పటికి రాష్ట్రంలో 18,14,393 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం రాష్ట్రంలో 67,629 యాక్టివ్ కేసులున్నాయి.
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం-1,51,321, మరణాలు 1021
చిత్తూరు-2,12,444, మరణాలు1511
తూర్పుగోదావరి-2,53,185, మరణాలు 1075
గుంటూరు -1,58,993,మరణాలు 1044
కడప -1,03,587 మరణాలు 590
కృష్ణా -97,608 ,మరణాలు 1055
కర్నూల్ - 1,20,519,మరణాలు 800
నెల్లూరు -1,24,711,మరణాలు 896
ప్రకాశం -1,17,281 మరణాలు 887
శ్రీకాకుళం-1,16,166, మరణాలు 687
విశాఖపట్టణం -1,46,464,మరణాలు 1030
విజయనగరం -78,912, మరణాలు 642
పశ్చిమగోదావరి-1,55,157, మరణాలు 996