ఒక్క రోజులోనే 10 మంది మృతి: ఏపీలో 11,489కి చేరిన కరోనా కేసులు

Published : Jun 26, 2020, 01:45 PM IST
ఒక్క రోజులోనే 10 మంది మృతి: ఏపీలో 11,489కి చేరిన కరోనా కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గత 24 గంటల్లో కొత్తగా 605 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 10  మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసులు 11,489కి చేరుకొన్నాయి.

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గత 24 గంటల్లో కొత్తగా 605 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 10  మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసులు 11,489కి చేరుకొన్నాయి.

24 గంటల్లో 22,305 శాంపిల్స్ ను పరీక్షిస్తే 605 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. ఒక్క రోజులో 191 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొని 4021 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం ఆసుపత్రుల్లో 5186 మంది కోలుకొంటున్నారు.

 

ఒక్క రోజు వ్యవధిలో విదేశాల నుండి వచ్చిన ఒక్కరికి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 34 మందికి కరోనా నిర్ధారణ అయినట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది.రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 1615 కేసులు రికార్డయ్యాయి. కృష్ణాలో 1199 కేసులు నమోదయ్యాయి.గుంటూరులో 1032 కేసులు నమోదైనట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు