భారీగా తగ్గిన కరోనా కేసులు: ఏపీలో మొత్తం 8,79,718కి చేరిక

Published : Dec 23, 2020, 06:10 PM IST
భారీగా తగ్గిన కరోనా కేసులు: ఏపీలో మొత్తం  8,79,718కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 379 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 79వేల 718 కి చేరుకొన్నాయి.   

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 379 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 79వేల 718 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు.  చిత్తూరు,వైఎస్ఆర్ కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,085కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,14,15,246 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 57,716 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 0379 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 68 వేల 769 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 3,864 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.


గత 24 గంటల్లో 019,చిత్తూరులో 064,తూర్పుగోదావరిలో 035, గుంటూరులో 046, కడపలో 033, కృష్ణాలో 084, కర్నూల్ లో 005, నెల్లూరులో 015, ప్రకాశంలో 013, శ్రీకాకుళంలో 016, విశాఖపట్టణంలో 032, విజయనగరంలో 004,పశ్చిమగోదావరిలో 013 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,196, మరణాలు 595
చిత్తూరు  -85,657,మరణాలు 839
తూర్పుగోదావరి -1,23,396, మరణాలు 636
గుంటూరు  -74,381, మరణాలు 662
కడప  -54,857, మరణాలు 457
కృష్ణా  -47,366,మరణాలు 661
కర్నూల్  -60,508, మరణాలు 487
నెల్లూరు -61,975, మరణాలు 505
ప్రకాశం -61,961, మరణాలు 578
శ్రీకాకుళం -45,873, మరణాలు 346
విశాఖపట్టణం  -58,952, మరణాలు 549
విజయనగరం  -40,994, మరణాలు 238
పశ్చిమగోదావరి -93,707, మరణాలు 532

 

 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఉపరితల ఆవర్తనంతోనే జోరువానలు, ఇప్పుడు ద్రోణి కూడా.. ఈ ప్రాంతాల్లో పెను బీభత్సమే
పిల్ల‌లు శోభ‌నం గ‌దిలో కూర్చున్న‌ట్లు కూర్చోవ‌డం ఏంటీ మాస్టారు.? గ‌రిక‌పాటి వివాదం ఏంటి, ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారు.?