24 గంటల్లో తూ.గోలో అత్యధికం, కర్నూల్‌లో అత్యల్పం: ఏపీలో 8,38, 363కి చేరిన కరోనా కేసులు

Published : Nov 06, 2020, 06:17 PM ISTUpdated : Nov 06, 2020, 10:35 PM IST
24 గంటల్లో తూ.గోలో అత్యధికం, కర్నూల్‌లో అత్యల్పం: ఏపీలో 8,38, 363కి చేరిన కరోనా కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2410కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 38వేల363కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2410కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 38వేల363కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 11మంది కరోనా మరణించారు.కరోనాతో కృష్ణాజిల్లాలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఇద్దరి చొప్పున మరణించారు. అనంతపురం, తూర్పుగోదావరి, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,768 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 85లక్షల 07వేల 230 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 79,4601 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2410మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 09 వేల 770 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 21,825 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 161,చిత్తూరులో 253,తూర్పుగోదావరిలో 401, గుంటూరులో 323, కడపలో132, కృష్ణాలో 298, కర్నూల్ లో 23 నెల్లూరులో 121, ప్రకాశంలో 108, శ్రీకాకుళంలో 071, విశాఖపట్టణంలో 142, విజయనగరంలో 079,పశ్చిమగోదావరిలో 298 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -65,408, మరణాలు 571
చిత్తూరు  -80,182మరణాలు 792
తూర్పుగోదావరి -1,18,015 మరణాలు 617
గుంటూరు  -69,006, మరణాలు 630
కడప  -52,899,మరణాలు 441
కృష్ణా  -41,169 మరణాలు 583
కర్నూల్  -59,661 మరణాలు 482
నెల్లూరు -60,123, మరణాలు 487
ప్రకాశం -60,321 మరణాలు 574
శ్రీకాకుళం -44,462 మరణాలు 343
విశాఖపట్టణం  -56,532 మరణాలు 514
విజయనగరం  -39,754 మరణాలు 230
పశ్చిమగోదావరి -87,936 మరణాలు 504


 

PREV
click me!

Recommended Stories

“ఆవకాయ్ అమరావతి” Festival Announcement | Minister Kandula Durgesh Speech | Asianet News Telugu
Nara Bhuvaneshwari Launches Free Mega Medical Rampachodavaram Under NTR Trust | Asianet News Telugu