ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,84,916కి చేరిక

Published : Jan 10, 2021, 06:16 PM ISTUpdated : Jan 10, 2021, 11:50 PM IST
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,84,916కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 227 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 84వేల 916 కి చేరుకొన్నాయి. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 227 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 84వేల 916 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,129కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,23,24,674 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 50,027 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 227 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 289 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 75 వేల 243 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 2,544 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.


గత 24 గంటల్లోఅనంతపురంలో014, చిత్తూరులో 022,తూర్పుగోదావరిలో 017, గుంటూరులో 050, కడపలో 007, కృష్ణాలో 038, కర్నూల్ లో 023, నెల్లూరులో 007, ప్రకాశంలో 005, శ్రీకాకుళంలో 007, విశాఖపట్టణంలో 019, విజయనగరంలో 008,పశ్చిమగోదావరిలో 010 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,504, మరణాలు 597
చిత్తూరు  -86,575,మరణాలు 845
తూర్పుగోదావరి -1,23,940 మరణాలు 636
గుంటూరు  -75,133, మరణాలు 667
కడప  -55,107, మరణాలు 461
కృష్ణా  -48,183,మరణాలు 671
కర్నూల్  -60,687, మరణాలు 487
నెల్లూరు -62,222 మరణాలు 506
ప్రకాశం -62,086 మరణాలు 580
శ్రీకాకుళం -46,023, మరణాలు 347
విశాఖపట్టణం  -59,426, మరణాలు 555
విజయనగరం  -41,076, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,059, మరణాలు 539

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu