తిరుపతి ఉప ఎన్నికలో ఉమ్మడి అభ్యర్ధి: వీర్రాజు కీలక వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 10, 2021, 6:07 PM IST
Highlights

శ్రీశైలంలో 2,500 మంది అన్యమతస్తుల ఉన్నారని ఆరోపించారు  ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆలయాల ఆస్తులపై ఏపీ ప్రభుత్వం కన్ను పడిందని ఎద్దేవా చేశారు.

శ్రీశైలంలో 2,500 మంది అన్యమతస్తుల ఉన్నారని ఆరోపించారు  ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆలయాల ఆస్తులపై ఏపీ ప్రభుత్వం కన్ను పడిందని ఎద్దేవా చేశారు.

హిందూ దేవాలయాలపై దాడులు చేస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఏపీలో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని వీర్రాజు ఆరోపించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో ఉమ్మడి అభ్యర్ధిని బరిలో దించుతామని ఆయన స్పష్టం చేశారు.

Also Read:స్థానిక సంస్థల ఎన్నికలకు బిజెపి సిద్ధమే : సోము వీర్రాజు

గత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధమేనని బిజెపి స్పష్టం చేసింది.

ఈ మేరకు బీజేపీ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. ఎన్నికల కమిషనర్ గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ దాదాపు 25 శాతం దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకుందన్నారు.

అదే సమయంలో పాత  నోటిఫికేషన్ రద్దు చేయాలని గతంలో సైతం ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఇదే అంశం అఖిలపక్ష సమావేశంలో నిమ్మగడ్డకు చెప్పామని సోము వీర్రాజు అన్నారు. .

click me!