నారాయణపురం అర్బన్ హెల్త్ సెంటర్‌లో మాయమైన కోవాగ్జిన్ వ్యాక్సిన్: పోలీసుల దర్యాప్తు

By narsimha lode  |  First Published May 17, 2021, 2:52 PM IST

కృష్ణా జిల్లాలోని  మచిలీపట్టణం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల నారాయణపురం  అర్బన్ హెల్త్ సెంటర్ లో  40 కోవాగ్జిన్  వ్యాక్సిన్  మాయమయ్యాయి. 


మచిలీపట్టణం: కృష్ణా జిల్లాలోని  మచిలీపట్టణం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల నారాయణపురం  అర్బన్ హెల్త్ సెంటర్ లో  40 కోవాగ్జిన్  వ్యాక్సిన్  మాయమయ్యాయి. నారాయణపురం అర్బన్ హెల్త సెంటర్  పరిధిలో  ప్రజలకు అందించాల్సిన వ్యాక్సిన్ మాయం కావడంపై  సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఆసుపత్రి సిబ్బంది  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలోని హెల్త్ సెంటర్ లో కరోనా వ్యాక్సిన్  డోసును తగ్గించి ఇస్తున్నారని ఆరోగ్య సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై జిల్లా జాయింట్ కలెక్టర్  విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ తో పాటు,  కరోనా రోగులకు అందించే  రెమిడెసివర్  లాంటి మందులు  తెలుగు రాష్ట్రాల్లో పక్కదారి పట్టాయనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కరోనాను కట్టడి చేయడంలో వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే  హెల్త్ సెంటర్  నుండి వ్యాక్సిన్ ఎలా మాయమైందనే విషయమై  అధికారులు కూడ ఆరా తీస్తున్నారు. 
 

Latest Videos

click me!