తూర్పుగోదావరిలో అదే జోరు: ఏపీలో 4,34,771కి చేరిన కరోనా కేసులు

Published : Aug 31, 2020, 06:51 PM ISTUpdated : May 24, 2021, 05:58 PM IST
తూర్పుగోదావరిలో అదే జోరు: ఏపీలో 4,34,771కి చేరిన కరోనా కేసులు

సారాంశం

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గత 24 గంటల్లో కొత్తగా 10,004 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 84 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 4 లక్షల 34 వేల 771కి చేరుకొన్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గత 24 గంటల్లో కొత్తగా 10,004 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 84 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 4 లక్షల 34 వేల 771కి చేరుకొన్నాయి.

గత 24 గంటల్లో అనంతపురంలో 973, చిత్తూరులో 936, తూర్పుగోదావరిలో1383, గుంటూరులో498, కడపలో420, కృష్ణాలో159, కర్నూల్ లో686, నెల్లూరులో 1086, ప్రకాశంలో 524, శ్రీకాకుళంలో 1023, విజయనగరంలో 540, పశ్చిమగోదావరిలో 1142 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో84 మంది మరణించారు. నెల్లూరులో 12 మంది, చిత్తూరు, ప్రకాశంలలో 9 మంది చొప్పున, కడపలో 8 మంది, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏడుగురి చొప్పున, విశాఖపట్టణంలో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణాలో ఇద్దరు. విజయనగరంలో ఒక్కరు మరణించారు.

గత 24 గంటల్లో కరోనా నుండి 8772 మంది కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 37,22,912 మంది నుండి శాంపిల్స్ సేకరించారు.

ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-41,128, మరణాలు 130
చిత్తూరు-36,649, మరణాలు 415
తూర్పుగోదావరి-59,403, మరణాలు 391
గుంటూరు -35,761, మరణాలు 376
కడప -26,119, మరణాలు 220
కృష్ణా -16,284, మరణాలు 278
కర్నూల్ -44,745, మరణాలు 378
నెల్లూరు -30,680, మరణాలు 294
ప్రకాశం -22,830, మరణాలు 284
విశాఖపట్టణం -36,694, మరణాలు 289
విజయనగరం -20,399, మరణాలు 164
పశ్చిమగోదావరి-37,106, మరణాలు 307


 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు