నెల్లూరులో విదేశీ మహిళపై అత్యాచారయత్నం.. మహిళా దినోత్సవం రోజే దారుణం..

Published : Mar 08, 2022, 04:12 PM ISTUpdated : Mar 08, 2022, 04:53 PM IST
నెల్లూరులో విదేశీ మహిళపై అత్యాచారయత్నం.. మహిళా దినోత్సవం రోజే దారుణం..

సారాంశం

నెల్లూరు విదేశీ మహిళపై దుండగులు అత్యాచారం జరిపేందుకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. మహిళ కేకలు వేయడంతో దుండగులు ఘటన స్థలం నుంచి పరారయ్యారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున దారుణం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలో ఓ విదేశీ మహిళపై అత్యాచారయత్నం చేశారు. వివరాలు..  సైదాపురం పరిధిలోని రావూరు రోడ్డులోని అటవీ ప్రాంతంలో బ్రిటన్‌కు చెందిన మహిళపై కొందరు దుండగులు అత్యాచారానికి యత్నించారు. మహిళ వద్ద ఉన్న డబ్బులను దొంగిలించారు. అయితే మహిళ కేకలు వేయండంతో.. అక్కడికి సమీపంలోని స్థానికులు  వెంటనే అక్కడికి చేరుకున్నారు. మహిళ కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. 

అనంతరం విదేశీ మహిళను స్థానికులు సైదాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ప్రస్తుతం మహిళ పోలీసుల సంరక్షణలో ఉంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Return rush: పండ‌గ అయిపోయింది.. ప‌ల్లె ప‌ట్నం బాట ప‌ట్టింది. హైవేపై ఎక్క‌డ చూసినా వాహ‌నాలే
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet