AP ZPTC MPTC Elections: ఏపీలో పెండింగ్‌లో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్..

By team teluguFirst Published Nov 16, 2021, 9:30 AM IST
Highlights

ఏపీలో పెండింగ్‌లో ఉన్న 10 జెడ్పీటీసీ (ZPTC) స్థానాలకు, 123 ఎంపీటీసీ (MPTC) స్థానాలకు నేడు పోలింగ్ (polling) కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో గతంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికలు (ap parishad elections) నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే విధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన కారణంగా ఆయా స్థానాల్లో ఎన్నికలు నిర్వహించడానికి కొద్ది రోజుల క్రితం ఎస్‌ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా నేడు రాష్ట్రంలోని 10 జెడ్పీటీసీ (ZPTC) స్థానాలకు, 123 ఎంపీటీసీ (MPTC) స్థానాలకు నేడు పోలింగ్ (polling) కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల పరిధిలో 8,07,640 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇందుకోసం 954 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

10 జెడ్పీటీసీ స్థానాల్లో 40 అభ్య‌ర్థులు పోటీ ప‌డుతుండ‌గా, 123 ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు.  నవంబర్ 18వ తేదీన ఓట్ల లెక్కింపు జ‌రుగనుంది. శ్రీకాకుళం జిల్లాలో 1 జెడ్పీటీసీ స్థానానికి, 13 ఎంపీటీసీ స్థానాలకు, విజయనగరం జిల్లాలో 09 ఎంపీటీసీ స్థానాలకు, విశాఖపట్నంలో 1  జెడ్పీటీసీ స్థానానికి, 06 ఎంపీటీసీ స్థానాలకు, తూర్ప గోదావరిలో 20 ఎంపీటీసీ స్థానాలకు, పశ్చిమ గోదావరిలో 1  జెడ్పీటీసీ స్థానానికి, 14 ఎంపీటీసీ స్థానాలకు, కృష్ణా జిల్లాలో 3  జెడ్పీటీసీ స్థానాలకు, 7 ఎంపీటీసీ స్థానాలకు, గుంటూరులో 1  జెడ్పీటీసీ స్థానానికి, 11 ఎంపీటీసీ స్థానాలకు,  ప్రకాశంలో 7 ఎంపీటీసీ స్థానాలకు, నెల్లూరులో 4 ఎంపీటీసీ స్థానాలకు,  చిత్తూరులో 1  జెడ్పీటీసీ స్థానానికి, 8 ఎంపీటీసీ స్థానాలకు, కడపలో 1 ఎంపీటీసీ స్థానానికి, కర్నూలులో 1  జెడ్పీటీసీ స్థానానికి,  7 ఎంపీటీసీ స్థానాలకు, అనంతపురంలో 1  జెడ్పీటీసీ స్థానానికి, 16 ఎంపీటీసీ స్థానాలకు నేడు పోలింగ్ కొనసాగుతుంది.

Also read: దొంగ ఓట్ల కల్చర్‌ టీడీపీదే... ఆధారాలివే..: ఎస్ఈసికి వైసిపి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఫిర్యాదు

వీటితో పాటే.. ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన కడప జిల్లా జమ్మలమడుగు ZPTC స్థానంలో రెండు బూత్‌లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోను మంగళవారం రీపోలింగ్ నిర్వహిస్తున్నట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు చెప్పారు. 

ఇక, సోమవారం పెండింగ్‌లో ఉన్న నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు, మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైసీపీ దొంగ నోట్ల వేయిస్తుందని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతుందని టీడీపీ ఆరోపించింది. అయితే వైసీపీ మాత్రం వాటిని తీవ్రంగా ఖండించింది. టీడీపీ చేసిన తప్పులని తమపై వేస్తున్నారని మండిపడింది. నిన్న ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైన సంగతి తెలిసిందే. 

click me!