సీతమ్మకు నేతకారుడి అద్భుత కానుక.. 196 అడుగుల భారీ చీర.. 13 భాషల్లో 32,200 సార్లు "జై శ్రీ రామ్"... (వీడియో)

By SumaBala Bukka  |  First Published Jan 12, 2024, 12:58 PM IST

జనవరి 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిర పవిత్రోత్సవానికి  ఆంధ్రప్రదేశ్ వ్యక్తి 196 అడుగుల చీరను బహుమతిగా ఇస్తున్నాడు. ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుడు జూజరు నాగరాజు సీతమ్మవారికోసం ఓ ప్రత్యేక బహుమతిని తయారు చేశాడు. తన జీవితకాలపు కష్టాన్నంతా దానికోసం వెచ్చించాడు.  


ధర్మవరం : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవిదేశాలనుంచి ఎంతో మంది భక్తులు కానుకలు పంపుతున్నారు. ఈ సందర్భంగా తమకు తోచిన రీతిలో రామయ్యకు సేవ చేసుకోవడానికి ప్రతీ ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ నేతకారుడు.. సీతమ్మవారికోసం 196 అడుగుల చీరను నేశాడు. 

Latest Videos

undefined

ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరానికి చెందిన జూజరు నాగరాజు అనే చేనేత కార్మికుడు తన జీవితకాలంలో పొదుపు చేసిన రూ.3.5 లక్షలను వెచ్చించి అయోధ్యలోని రామమందిరానికి బహుమతిగా 196 అడుగుల భారీ చీరను రూపొందించాడు. 

ఆ వీడియో ఇక్కడ చూడండి..


 
సీతా దేవి విగ్రహం కోసం తయారు చేసిన ఈ చీరలో 13 భాషల్లో 32,200 సార్లు "జై శ్రీ రామ్" అనే పదాన్ని ఎంబ్రాయిడరీ చేశారు. జనవరి 22న జరిగే ఆలయ సంప్రోక్షణ కార్యక్రమంలో ఈ అందమైన చీరను సమర్పించాలని నాగరాజు భావిస్తున్నాడు.

కాంగ్రెస్ పార్టీ అయోధ్య ప్రారంభోత్సవాన్ని తిరస్కరించడానికి కారణం ఏంటి?

చీరలో రామాయణంలోని అనేక ఘట్టాలను చిత్రించారు. ఈ ప్రత్యేకమైన చీర "రామ కోటి వస్త్రం" అనే ప్రత్యేక వస్త్రంతో తయారు చేశారు. తమిళం, తెలుగు, మరాఠీ, ఉర్దూ, మలయాళం. ఒడియా లాంటి భాషల్లోని శ్లోకాలను చీరమీద నేశారు. ప్రధాన హిందూ ఇతిహాసం రామాయణంలోని రాముడి జీవిత కథ నుండి 168 చిత్రాలను ఈచీరలో పొందుపరిచారు. 

16 కిలోల బరువున్న ఈ చీర సాంప్రదాయ చీర కంటే దాదాపు 11 రెట్లు ఎక్కువ. ఈ చీర తయారు చేయడం కోసం నాగరాజు ఆరు నెలలు పని చేసాడు, ప్రతిరోజూ సుమారు 10 గంటలు ఈ చీరను నేశాడు. శంకుస్థాపన కార్యక్రమంలో చీరను బహూకరించేందుకు అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు. 

నాగరాజు ప్రస్తుతం శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌తో చీరను అందజేయడంపై చర్చలు జరుపుతున్నారు. టైమ్స్ నౌ తో మాట్లాడుతూ.. "ట్రస్ట్ సభ్యుల నుండి నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత, ఈ ప్రత్యేక చీరను అందించడానికి వ్యక్తిగతంగా నేనే అయోధ్యకు వెళ్తాను" అని చెప్పాడు. 

జనవరి 22న ఈ బహుమతిని అందించడం కుదరకపోతే.. మరో ప్రత్యేక సందర్భంలో మళ్లీ ప్రయత్నించాలని ప్లాన్ చేస్తున్నాడు. చీరను ఇటీవల స్థానికంగా ప్రదర్శించాడు నాగరాజు. దీనిని వీక్షించడానికి సుమారు 500 మంది సందర్శకులు వచ్చారు.

click me!