ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

By narsimha lodeFirst Published Jan 8, 2020, 1:10 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు బుధవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అమరావతి:ఏపీ రాష్ట్రంలో  స్థానిక  సంస్థల ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం నాడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లను అమలు  విషయమై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అఫిడవిట్‌‌కు హైకోర్టు ఆమోదముద్ర వేసింది.


ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అఫిడవిట్‌‌కు హైకోర్టు ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు దశల్లో మండల పరిషత్ ఎన్నికలు, మూడు దశల్లో  గ్రామ పంచాయితీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ మేరకు  ఎన్నికల సంఘం సమర్పించిన అఫిడవిట్‌కు ఏపీ రాష్ట్ర హైకోర్టు ఓకే చెప్పింది.

Also read:సచివాలయానికి జగన్... వారికి ఆంక్షలు.. భోజనం కూడా చేయనివ్వకుండా

జనవరి 17వ తేదీన ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 10వ తేదీన  ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.   ఇక గ్రామ పంచాయితీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారు.

గ్రామ పంచాయితీ ఎన్నికలకు ఫిబ్రవరి 8వ తేదీన నోటీఫికేషన్ వెలువడనుంది. మార్చి 3వ తేదీన ఎన్నికలు పూర్తి కానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల అమలు విషయమై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్దంగా రిజర్వేషన్లు ఉన్నాయని ప్రతాప్ రెడ్డి ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు. అయితే  స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు విముఖతను చూపింది.రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన  అఫిడవిట్‌ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు  హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 

click me!