బొండా ఉమా కు హైకోర్టులో చుక్కెదురు

By telugu teamFirst Published Jun 29, 2019, 8:50 AM IST
Highlights

టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు కి హైకోర్టులో చుక్కెదురైంది. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ ఫలితంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బొండా ఉఉమా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు కి హైకోర్టులో చుక్కెదురైంది. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ ఫలితంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బొండా ఉమా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ కేసులో వాదోపవాదాలు విన్న న్యాయస్థానం 

రిట్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదని స్పష్టం చేస్తూ ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం కొట్టేసింది. ఓట్ల లెక్కింపుపై ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిల ధర్మాసనం పేర్కొంది. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బొండా ఉమా కేవలం 25ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓటమిపాలయ్యారు. దీనిపై టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గంలోని 11 పోలింగ్‌ కేంద్రాల్లో వీవీప్యాట్లను లెక్కించిన తర్వాతే ఫలితాల్ని ప్రకటించాలని కోరినా రిటర్నింగ్‌ అధికారి పట్టించుకోలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

కాబట్టి, తనపై 25 ఓట్లతో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు గెలుపొందినట్లు అధికారులు మే 23న జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన అందులో కోరారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు వ్యత్యాసాల్ని గమనించానని బోండా న్యాయస్థానానికి విన్నవించారు. 

click me!