అమరావతి అసైన్డ్ భూముల కేసు: మాజీ మంత్రి నారాయణ పిటిషన్లపై విచారణ రెండు వారాలకు వాయిదా

By narsimha lode  |  First Published Nov 15, 2023, 12:01 PM IST

టీడీపీ నేతలను వరుస  కేసులు వెన్నాడుతున్నాయి. ఈ కేసుల విషయంలో  టీడీపీ నేతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మాజీ మంత్రి పి. నారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు ఇవాళ చేపట్టింది.


అమరావతి: అమరావతి అసైన్డ్ భూముల  కేసులో మాజీ మంత్రి పొందుగుల నారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను  బుధవారంనాడు రెండు వారాలకు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈ కేసులో  మాజీ మంత్రి నారాయణ  ముందస్తు బెయిల్ తో పాటు  ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని పిటిషన్  దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై విచారణను  రెండు వారాలకు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.

అమరావతి  అసైన్డ్ భూముల కేసును రీ ఓపెన్ చేయాలని  హైకోర్టులో  ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్ పై ఏపీ  హైకోర్టు విచారణ నిర్వహించింది. అయితే తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.

Latest Videos

undefined

2021 ఫిబ్రవరి  24న  మాజీ మంత్రి పి. నారాయణతో పాటు చంద్రబాబుపై  సీఐడీ  కేసు నమోదు చేసింది.  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. 

అమరావతి అసైన్డ్ భూముల కేసుతో పాటు  అమరావతి అలైన్ మెంట్  లో మార్పు చేర్పుల విషయంలో  చంద్రబాబు, పి. నారాయణలపై కూడ కేసులను ఏపీ సీఐడీ నమోదు చేసిన విషయం తెలిసిందే.తమ సంస్థలు, తమవారి భూములకు లబ్ది కలిగేలా రాజధాని అలైన్ మెంట్ ను మార్చారని   ఏపీ సీఐడీ కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే.

click me!