బడుగులకు సీఎం జగన్ ప్రాధాన్యం.. ఎస్సీలుగా పుడితే బాగుండేదనే భావనలో రెడ్లు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

Published : Apr 18, 2022, 09:53 AM ISTUpdated : Apr 18, 2022, 12:20 PM IST
బడుగులకు సీఎం జగన్ ప్రాధాన్యం.. ఎస్సీలుగా పుడితే బాగుండేదనే భావనలో రెడ్లు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉంది రెడ్ల రాజ్యం కాదని.. బడుగుల రాజ్యం అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ప్రభుత్వంలో బడుగులకే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉంది రెడ్ల రాజ్యం కాదని.. బడుగుల రాజ్యం అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ప్రభుత్వంలో బడుగులకే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.నేడు ఉప ముఖ్యమంత్రిగా నారాయణ స్వామి బాధ్యతలు స్వీకరించారు. దేవుడి ఫొటోకు బదులు సీఎం జగన్ ఫొటోతో తన ఛాంబర్‌లో ప్రవేశించారు. తన ఛాంబర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఎక్సైజ్ శాఖలో మరణించిన ఇద్దరు ఉద్యోగులకు మెడికల్ రీయింబర్సుమెంట్ విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు.

ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ... బడుగులకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యం చూసి ఎస్సీలుగా పుడితే బాగుండేదనే భావనలో రెడ్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. తనకు ప్రాధాన్యం లేకుంటే తప్పు చేసిన ఎక్సైజ్ సిబ్బందిని సస్పెండ్ చేయగలిగేవాడినా అని ప్రశ్నించారు. తప్పుచేసిన వారిని సస్పెండ్ చేస్తున్న ప్రతిసారి బాధపడుతూనే ఉంటానని అన్నారు. 

ఎక్సైజ్ సిబ్బంది ప్రలోభాలకు గురి కావద్దని నారాయణ స్వామి కోరారు. సస్పెన్షన్లు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు. రెండోసారి తనకు పదవి దక్కుతుందని ఊహించలేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనపై పెట్టిన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు. మరోవైపు జగన్ ఫొటోతో ఛాంబర్‌లోని ప్రవేశించడంపై స్పందించిన  నారాయణ స్వామి..  బడుగుల దేవుడిగా జగన్ అవతరించారని.. అందుకే ఆయన చిత్రపటానికి పూజలు చేసి బాధ్యతలు స్వీకరించినట్లు మంత్రి నారాయణ స్వామి వెల్లడించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!