వరద బాధితులకు అండగా ఉంటాం: తిరుపతిలో సీఎం జగన్ టూర్

By narsimha lode  |  First Published Dec 3, 2021, 9:27 AM IST

వరద ప్రభావిత జిల్లాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు సీఎం జగన్ పర్యటిస్తున్నారు. నిన్న కడప జిల్లాలో పర్యటించారు. అక్కడి నుండి నేరుగా ఆయన చిత్తూరు జిల్లా టూర్ కు వచ్చారు. ఇవాళ తిరుపతిలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు.



తిరుపతి: టెంపుల్ సిటీ Tirupatiలోని శ్రీకృష్ణా నగర్‌లో వరదలకు దెబ్బతిన్న ఇళ్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు పరిశీలించారు. రాష్ట్రంలోని Nellore, Chittoor, kadapa జిల్లాల్లో రెండు రోజుల పాటు  సీఎం జగన్ పర్యటిస్తున్నారు.  నిన్న కడప జిల్లాలో పర్యటించారు. కడప టూర్ ముగిసిన తర్వాత సీఎం Ys Jagan నిన్ననే చిత్తూరు జిల్లా టూర్ కు వచ్చారు. రాత్రి తిరుపతిలోని సీఎం జగన్ బస చేశారు. ఇవాళ ఉదయం తిరుపతిలోని శ్రీకృష్ణా నగర్ లో వరద భావిత ప్రాంతాల్లో పర్యటించారు.గత మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలను Heavy rains  ముంచెత్తాయి. ఈ వర్షాలతో భారీగా నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అన్నమయ్య, పింఛ ప్రాజెక్టులు తెగిపోయాయి.  చెయ్యేరు వరద ప్రభావంతో సుమారు 30 మంది గల్లంతయ్యారు. వరద బాధితులకు  ప్రభుత్వం పరిహారం అందించింది. మరో వైపు నిత్యావసర సరుకులను కూడా అందించింది.

నిన్ననే చిత్తూరు జిల్లాకు చేరుకొన్న సీఎం జగన్ ఇవాళ ఉదయం తిరుపతి పట్టణంలోని  శ్రీకృష్ణానగర్ లో  వరద బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకొంటుందని ఆయన హామీ ఇచ్చారు.  వరద నష్టాలపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని  సీఎం జగన్ తిలకించారు.   వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో సీఎం జగన్ నేరుగా మాట్లాడారు. వరదలతో చోటు చేసుకొన్న నష్టం వివరాలను బాాధితులను అడిగి తెలుసుకొన్నారు.  బాధితులను ప్రభుత్వం ఆదుకొంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. 

Latest Videos

undefined

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మాసంలో భారీ వర్షాలు కురిశాయి. వాయు గుండం  ప్రభావంతో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తాయి. ప్రధానంగా మూడు జిల్లాల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. బ్రిడ్జిలు,  కాజ్ వేలు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారులు కోతకు గురయ్యాయి. రైల్వేట్రాక్ లు దెబ్బతిన్నాయి. జన జీవనం స్థంభించింది. వరదలకు గ్రామాలకు గ్రామాలే నీటిలోనే ఉన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను  అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను  సీఎం జగన్ పరామర్శించారు.  ప్రభుత్వం అందిస్తున్న సహాయం వివరాలను జగన్ అడిగి తెలుసుకొన్నారు.

also read:కడప జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన (ఫోటోలు)

ఇదిలా ఉంటే రానున్న రెండు మూడు రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని  వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. ఉత్తరాంధ్రతో పాటు, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల అధికారులతో సీఎం జగన్  సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా సీఎం అధికారులను ఆదేశించారు.భారీ వర్షాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని  ఏపీ సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు.  తమ రాష్ట్రానికి తక్షణంగా రూ. 1000 కోట్లు ఇవ్వాలని కూడా జగన్  ప్రధాని మోడీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు.  కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించింది.వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనాలను తయారు చేసి కేంద్రానికి నివేదికను అందించనుంది. 

 

click me!