బెజవాడ పరిసరాల్లో సంచరిస్తోన్న చెడ్డీ గ్యాంగ్.. ఇబ్రహీంపట్నంలో చోరీకి విఫలయత్నం (వీడియో)

By Siva KodatiFirst Published Dec 2, 2021, 8:35 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన చెడ్డీ గ్యాంగ్‌ తాజాగా విజయవాడలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చిట్టినగర్ ప్రాంతంలో చోరీకి పాల్పడిన ఈ ముఠా.. తాజాగా నగర శివారు ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హల్‌చల్‌ చేసింది

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన చెడ్డీ గ్యాంగ్‌ తాజాగా విజయవాడలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చిట్టినగర్ ప్రాంతంలో చోరీకి పాల్పడిన ఈ ముఠా.. తాజాగా నగర శివారు ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హల్‌చల్‌ చేసింది. గుంటుపల్లి గ్రామంలోని ఓ అపార్ట్‌మెంట్లోకి ఐదుగురు సభ్యుల ముఠా ప్రవేశించింది. అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో కర్రలు, మారణాయుధాలతో చెడ్డీగ్యాంగ్‌ ప్రవేశించడం అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాల్లో నమోదైంది. అయితే ఆ సమయంలో అలికిడి రావడంతో ఓ ఫ్లాట్‌ యజమాని కారిడార్‌లోని లైట్లు వేయడంతో అగంతకులు అక్కడి నుంచి పరారయ్యారు. మరో వైపు చెడ్డీగ్యాంగ్ పేరు విన్న పరిసర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇకపోతే.. విజయవాడ 2 టౌన్ పరిధిలో అర్ధరాత్రి చెడ్డి గ్యాంగ్ హల్ చల్ వీడియో సిసి కెమెరాల్లో రికార్డయ్యింది.  దీంతో ఎప్పుడు ఎవరి ఇంటిపై విరుచుకుపడతారోనని నగర ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సిసి కెమెరా వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం vijayawada చిట్టీనగర్‌లోని శివదుర్గ అపార్ట్‌మెంట్లోని ఓ ఫ్లాట్ లో డబ్బు, బంగారం చోరీకి గురయ్యింది. ఫ్లాట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిసి కెమెరాలను పరిశీలించగా cheddi gang పనిగా తేలింది. 

చెనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్దగల అపార్ట్ మెంట్ లోకి సోమవారం తెల్లవారుజామున 3.15గంటల సమయంలో చెడ్డిగ్యాంగ్ సభ్యులు ప్రవేశించారు. మొదటి అంతస్తులోని ఫ్లాట్ నెంబర్ జి18కు తాళం వేసివుండటాన్ని గమనించారు. దీంతో తాళం పగలగొట్టి ఫ్లాట్ లోకి ప్రవేశించిన ఈ ముఠా సభ్యులు బంగారంతో పాటు నగదు దోచుకున్నారు. ఉదయం తన ఫ్లాట్ లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అపార్ట్ మెంట్ లోని సిసి కెమెరాలను పరిశీలించగా చెడ్డీ గ్యాంగ్ ఈ దోపిడీకి పాల్పడినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ఆగడాలను అడ్డకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 

 

"

click me!