జీఎస్‌డీపీలో దేశంలోనే ఏపీ టాప్: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

Published : Mar 14, 2023, 10:31 AM ISTUpdated : Mar 14, 2023, 03:26 PM IST
జీఎస్‌డీపీలో దేశంలోనే  ఏపీ టాప్: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

సారాంశం

నాలుగేళ్లుగా పేద ప్రజల సంక్షేమం కోసం  రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని  ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్  చెప్పారు.  ఇవాళ  ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభించారు.   

అమరావతి:జీఎస్‌డీపీలో  దేశంలోనే  రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని  ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్  చెప్పారు. ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను  ఏపీ గవర్నర్  అబ్దుల్ నజీర్  మంగళవారంనాడు  ప్రారంభించారు.  గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా  ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్  ప్రారంభించారు. 

ప్రతి ఏటా  11.43  శాతం  జీఎస్‌డీపీ వృద్దిరేటు సాధించిన విషయాన్ని గవర్నర్ ఈ సందర్భంగా  ప్రస్తావించారు.  ఏపీలో  తలసరి ఆదాయం  రూ. 2.19 లక్షలకు పెరిగిందన్నారు.రాష్ట్ర ఆర్ధికపరిస్థితి నాలుగేళ్లుగా  మెరుగుపడిందని  గవర్నర్  చెప్పారు.  

నాలుగేళ్లుగా  రాష్ట్రంలో  పారదర్శకంగా  పాలన  సాగుతుందని  గవర్నర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు  నేరుగా  లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు  చేరుతున్న విషయాన్ని గువర్నర్ గుర్తు  చేశారు.  ఏపీలో  నాలుగేళ్లుగా  సుపరిపాలన  అందిస్తున్న విషయాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్  తెలిపారు.

పరిశ్రమలు , వ్యవసాయం, సేవా రంగంలో  గణనీయమైన అభివృద్దిని  సాధించినట్టుగా గవర్నర్ చెప్పారు.మన బడి , నాడు-నేడు  ద్వారా తొలి దశలో  రూ.3669 కోట్లతో ఆధునీకీకరణ  చేపట్టినట్టుగా  గవర్నర్ తెలిపారు. అమ్మఒడి  ద్వారా  80 లక్షల  పిల్లలకు  ఆర్ధిక సహాయం అందిస్తున్న విషయాన్ని గవర్నర్ నజీర్  చెప్పారు.44.49 లక్షల మంది తల్లులకు  రూ.19,617.60 కోట్ల ఆర్ధిక సహయం అందించిన విషయాన్ని గవర్నర్ గుర్తు  చేశారు.

విద్యా రంగంలో డిజిటల్ లెర్నింగ్  కీలక అంశమని  గవర్నర్ చెప్పారు. డిజిటల్ లెర్నింగ్  కోసం విద్యార్ధులకు  రూ. 690 కోట్ల విలువైన  5.20 లక్షల ట్యాబ్ లను  పంపిణీ చేసినట్టుగా  గవర్నర్ తెలిపారు. 2020-21 విద్యా సంవత్సరం  నుండి పాఠ్యాంశాల సంస్కరణలు అమలు చేస్తున్న విషయాన్ని గవర్నర్ గుర్తు  చేశారు. ఒకటో తరగతి నుండి  ఏడో తరగతి వరకు  పాఠ్యపుస్తకాల  రీడిజైన్  చేసినట్టుగా గవర్నర్ వివరించారు..జగనన్న  గోరుముద్దతో  43.26 లక్షల మంది  విద్యార్ధులకు లబ్ది  కలగనుందని  గవర్నర్ చెప్పారు. 

ఆర్ధిక భారం లేకుండా  ఉచితంగా  ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని   గవర్నర్ చెప్పారు. రాష్ట్రంలో  ప్రతి మండలంలో  రెండు జూనియర్ కాలేజీలను  ఏర్పాటు  చేస్తున్నట్టుగా  గవర్నర్ తెలిపారు.  జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీ ఎంబర్స్ మెంట్  అందిస్తున్నామన్నారు. 
కురుపాంలో  గిరిజన ఇంజనీరింగ్  కాలేజీని  ఏర్పాటు చేశామన్నారు.  విజయనగరంలో  జేఎన్‌టీయూ-గురజాడ,  ఒంగోలులో  ఆంధ్రకేసరి , కడపలో  వైఎస్ఆర్ అర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్  వర్శిటీ, కర్నూల్ లో  క్లస్టర్  యూనివర్శిటీ ఏర్పాటు  చేసినట్టుగా  గవర్నర్ తెలిపారు. ఉన్నత విద్య కోసం  14 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను  ఏర్పాటు చేసినట్టుగా  గవర్నర్ వివరించారు. 

స్థానిక సంస్థల్లో  మహిళలకు 50 శాతం  రిజర్వేషన్లు కల్పించినట్టుగా  గవర్నర్ తెలిపారు. నామినేటేడ్  పదవుల్లో  మహిళలకు  50 శాతం రిజర్వేషన్లు కల్పించిన  విషయాన్ని గవర్నర్ ఈ సందర్భంగా  ప్రస్తావించారు. మహిళల  భధ్రత కోసం  దిశ యాప్ ను ప్రారంభించినట్టుగా  చెప్పారు.  ఆపదలో  ఉన్న మహిళల  వద్దకు  క్షణాల్లో  వెళ్లి రక్షణ కల్పిస్తున్నట్టుగా  గవర్నర్ తెలిపారు. 

వైద్య శాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్ కార్డులు అందించినట్టుగా  గవర్నర్ చెప్పారు. రూ.971 కోట్లతో  ఆరోగ్య ఆసరా పథకం అమలు చేస్తున్నట్టుగా  ఆయన చెప్పారు. ప్రజల ఇంటి వద్దకే  ఫ్యామిలీ డాక్టర్  పధకం అమలు చేస్తున్నామన్నారు. ప్రతి పీహెచ్‌సీలో  ఇద్దరు డాక్టర్లు ఉండేలా  చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ తెలిపారు. 

2024 నాటికి అర్హులైన  ప్రజలకు శాశ్వత గృహలను అందిస్తున్నామన్నారు. మహిళల పేరుతో  30.65 లక్షల  ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ  చేసినట్టుగా  గవర్నర్ తెలిపారు. ప్రతి నెల  1వ తేదీన వైఎస్ఆర్  పెన్షన్ కాను అందిస్తున్నామన్నారు.ప్రతి నెల  64.45 లక్షల మందికి  రూ.66,823.79 కోట్ల పెన్షన్లను పంపిణీ  చేస్తున్నామని  గవర్నర్ వివరించారు. 

మహిళలను అప్పుల ఊబి నుండి బయటపడేసేందుకు గాను  వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని  ప్రభుత్వం  అమలు చేస్తుందని  గవర్నర్ తెలిపారు. పోలవరం,  పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులు, రాయలసమీ  కరువు నివారణ ప్రాజెక్టుతో పాటు  ఇతర ప్రాజెక్టు పనులు పురోగతిలో  ఉన్నాయని గవర్నర్  చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం