ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారంనాడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇవాళ ప్రసంగించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారంనాడు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రారంభించారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించేందుకు అసెంబ్లీకి వచ్చిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్, శాసనమండలి చైర్మెన్ ,, శాసనసభ స్పీకర్, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. గవర్నర్ ను అసెంబ్లీ లోపలికి సాదరంగా తీసుకువచ్చారు.
అసెంబ్లీ లోపలికి అడుగుపెట్టిన గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు.
సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన అబ్దుల్ నజీర్ ఇటీవలనే రిటైర్ అయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా రిటైరైన వెంటనే ఏపీ గవర్నర్ గా నజీర్ ను నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఏపీ గవర్నర్ గా పనిచేసిన బిశ్వభూషన్ హరిచందన్ ను ఛత్తీస్ ఘడ్ కు రాష్రపతి బదిలీ చేశారు. ఏపీ రాష్ట్రానికి గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్ నజీర్ ను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిన్న మర్యాద పూర్వకంగా కలిశారు.