ఏపీ రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ అయ్యారు. ఏపీ ఇంచార్జీ సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేస్తూ సోమవారం నాడు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని బాపట్ల హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
ఏపీ సీసీఎల్ఏ సెక్రటరీ గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్‌ను ఇంచార్జీ సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.జీఎడీ ప్రిన్సిపల్ సెక్రటీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ ఇటీవల కాలంలో బిజినెస్ రూల్స్ మార్చడంతో పాటు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సీరియస్ అయ్యారు. ఈ మేరకు ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
undefined
సీఎం ఆదేశాల మేరకే ప్రవీణ్ ప్రకాష్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. అయితే తనకు తెలియకుండానే బిజినెస్ రూల్స్ మార్చడంతో పాటు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజినెస్ రూల్స్ తో పాటు కండక్ట్ రూల్స్‌ను అతిక్రమించాడని ఆరోపిస్తూ ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ నోటీసులను జారీ చేశాడు.
ఈ వ్యవహరం ఏపీ సీఎం వైఎస్ జగన్ కు , సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మధ్య అగాధం పెరిగిందనే ప్రచారం సాగుతోంది.ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం జీఎడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌కు నోటీసులు జారీ చేసినట్టుగా చెబుతున్నారు.
సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై సీఎం సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎస్ బదిలీ చేసినట్టుగా సమాచారం. బాపట్ల హెచ్ఆర్‌డీ డైరెక్టరర్ జనరల్‌గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంచార్జీ సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్‌ను నియమించారు. మరో వైపు ఏపీ సీఎస్ గా నీలం సహాని, సమీర్ శర్మల పేర్లను ప్రభుత్వం ఏపీ సీఎస్‌గా నియమించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.
నీలం సహాని 1984 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి. సమీర్ శర్మ 1985 బ్యాచ్ అధికారి. సమీర్ శర్మ ప్రస్తుం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. నీలం సహాని 2020 జూన్ 30వ తేదీన రిటైర్ కానున్నారు.
సమీర్ శర్మ 2021 నవంబర్ 30వ తేదీన రిటైరౌతారు. మరో వైపు కేంద్ర సర్వీసుల్లో ఉన్న అజయ్ సహాని కూడ 1984 బ్యాచ్ అధికారి. అజయ్ సహాని 2022 ఫిబ్రవరి 28న రిటైర్ కానున్నారు. అజయ్ సహాని కూడ సీఎస్ పదవి రేసులో ఉన్నారు.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రమణ్యం ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సమయంలో ఈసీ ఆదేశాల మేరకు ఏపీ సీఎస్ అనిల్ పునేఠాను బదిలీ చేసి ఎల్వీ సుబ్రమణ్యాన్ని నియమిస్తూ ఆ సమయంలో ఈసీ ఆదేశాలను జారీ చేసింది.
ఈ ఆదేశాల మేరకు ఎల్వీ సుబ్రమణ్యం ఏపీ ప్రభుత్వ సీఎస్‌గా నియమితులయ్యారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ ఎల్వీసుబ్రమణ్యాన్ని కొనసాగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.
ఇటీవల కాలంలో ఎల్వీ సుబ్రమణ్యానికి, సీఎం జగన్ కు మధ్య ప్రవీణ్ ప్రకాష్ కారణంగా అగాధం పెరిగినట్టు ప్రచారం సాగింది. ఈ ప్రచారానికి ఊతమిస్తూ ఇవాళ ఏపీ ప్రభుత్వం ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకొంది.
1983 బ్యాచ్‌కు చెందిన ఎల్వీ సుబ్రమణ్యం 2020 ఏప్రిల్ 30వ తేదీన రిటైర్ కానున్నారు. ఎల్వీ సుబ్రమణ్యానికి మరో 5 మాసాల 26 రోజుల సర్వీస్ మాత్రమే ఉంది. సీఎస్‌గా రిటైర్ అవుతారని భావించినప్పటికీ సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ విషయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తీసుకొన్న నిర్ణయంపై సీఎం వైఎస్ జగన్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా సమాచారం.
ఈ వార్త చదవండి
ఇంకా రాని ఈసీ అనుమతి: చంద్రబాబు కేబినెట్ భేటీపై సస్పెన్స్