
చంద్రబాబు చేతిలో పవన్ కల్యాణ్ పావు అంటూ వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) . ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పవన్‌కు కనపడదంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబును మళ్లీ సీఎంను చేయాలని పవన్ రాజకీయ ప్రయాణం చేస్తున్నారని రాంబాబు ఆరోపించారు. ర్యాంబో రాంబాబు అని తనపై పవన్ సెటైర్ వేయలేదా అని మంత్రి ప్రశ్నించారు. పవన్‌కు స్క్రీన్ ప్లే మాత్రమే వచ్చని.. తమకు సినిమా తీయడం కూడా వచ్చంటూ రాంబాబు సెటైర్లు వేశారు. తమపై వ్యంగ్యంగా మాట్లాడిన పవన్.. తనపై మాత్రం సెటైర్లు వేయొద్దంటున్నారంటూ ఫైర్ అయ్యారు.
కాపు వర్గం ఓట్ల కోసం చంద్రబాబు (chandrababu naidu) పవన్‌ను గాలంగా వేశారని రాంబాబు ఆరోపించారు. పవన్‌కు తనకంటూ సొంత ఆలోచన లేదని అంబటి దుయ్యబట్టారు. ఏపీ మంత్రుల మీద సెటైర్లు వేసిన విషయం పవన్‌కు గుర్తు లేదా అని మంత్రి ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటమే లక్ష్యమని చెబుతున్నాడని రాంబాబు ఫైర్ అయ్యారు. నారా వారి దత్తపుత్రుడు అనే సినిమా తీయాలని అనుకుంటున్నామని ఆయన చెప్పారు. పొత్తు లేకుండా పోటీ చేసే దమ్ము పవన్‌కు వుందా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
అంతకుముందు శనివారం ఏలూరు జిల్లా చింతలపూడిలో ఏర్పాటు చేసిన జనసేన రచ్చబండ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ (Pawan kalyan) మాట్లాడుతూ.. తాను వస్తున్నానని ఒక సామాజిక వర్గానికి చెందిన కౌలు రైతులకు పరిహారం ఇచ్చారని.. మిగిలిన సామాజిక వర్గాల రైతుల్ని వదిలేశారని పవన్ ఆరోపించారు. జనసేన కావాలో, వైసీపీ (ysrcp) కావాలో యువత తేల్చుకోవాలని.. సీపీఎస్ (cps) రద్దు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు టెక్నికల్‌గా సాధ్యం కాదంటున్నారని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు.
దేశంలో 80 శాతం వ్యవసాయాన్ని కౌలు రైతులే చేస్తున్నారని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. .. కౌలు రైతులకు వైసీపీ ప్రభుత్వం అండగా లేదని ఆయన ఆరోపించారు. వైసీపీ (ysrcp) సర్కార్ కౌలు రైతులకు అండగా వుంటే తాను రోడ్లపైకి వచ్చే పరిస్ధితి వుండేది కాదని పవన్ వ్యాఖ్యానించారు. పాదయాత్రలో కన్నీళ్లు తుడిస్తే సరిపొదని.. అధికారంలోకి వచ్చాక కూడా ఆ పనిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో వుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కౌలు రైతుల కష్టాలు పరిష్కరించకుండా తనను దత్తపుత్రుడు అని విమర్శిస్తున్నారని ఆయన ఫైరయ్యారు.
తనను దత్తపుత్రుడు అని విమర్శిస్తే మిమ్మల్ని కూడా సీబీఐ (cbi) దత్తపుత్రుడని అంటాంటూ పవన్ హెచ్చరించారు. దత్తపుత్రుడు అని వారి నోటి నుంచి వస్తే సీబీఐ దత్తపుత్రుడని ఫిక్స్ అవుతామన్నారు. చంచల్‌గూడలో షటిల్ ఆడుకున్న మీరు నాకు చెబుతారా అంటూ పవన్ ఫైరయ్యారు. సొంతవారు వున్నప్పుడు ఎవరైనా ఎందుకు దత్తతకు వెళ్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తాను మీకంటే బాగా స్క్రీన్ ప్లే రాయగలనని.. సీఎం పదవికి తాను గౌరవం ఇస్తున్నానని, అందుకే మీరు అని అంటున్నానని పవన్ వ్యాఖ్యానించారు.