టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా విడుదల: 94 స్థానాల్లో టీడీపీ, 5 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన

Published : Feb 24, 2024, 11:44 AM ISTUpdated : Feb 24, 2024, 12:51 PM IST
టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా విడుదల: 94 స్థానాల్లో టీడీపీ, 5 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి.ఈ విషయాన్ని  గత ఏడాదే జనసేన ప్రకటించిన విషయం తెలిసిందే.


అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలుగు దేశం, జనసేన పార్టీలు  తొలి  జాబితాను ప్రకటించాయి. శనివారం నాడు ఉదయం చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్  వచ్చారు.   చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 

రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం  రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని చంద్రబాబు నాయుడు చెప్పారు.  మూడు ఎంపీ స్థానాల్లో  జనసేన పోటీ చేస్తుందని  చంద్రబాబు తెలిపారు. తమ కూటమిలోకి బీజేపీ వస్తే  ఆ పార్టీకి కేటాయించే సీట్లపై కూడ చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.94 స్థానాల్లో  టీడీపీ, 24 స్థానాల్లో  జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నట్టుగా  నేతలు చెప్పారు.

 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా

1.ఇచ్చాపురం-బెందాళం ఆశోక్
2.టెక్కలి-కింజారపు అచ్చెన్నాయుడు
3.రాజాం-కొండ్రు మురళిమోహన్
4.పెద్దాపురం-నిమ్మకాయల చినరాజప్ప
5.తుని-యనమల దివ్య
6.మంగళగిరి-నారా లోకేష్
7.రేపల్లే-సత్యప్రసాద్
8.వేమూరు-నక్కా ఆనంద్ బాబు
9.ముమ్మిడివరం-సుబ్బరాజు
10.విశాఖ ఈస్ట్-వెలగపూడి రామకృష్ణబాబు
11.విశాఖ వెస్ట్-గణబాబు
12.అద్దంకి-గొట్టిపాటి రవికుమార్
13.పర్చూర్-ఏలూరి సాంబశివరావు
14.చిలకలూరిపేట-పత్తిపాటి పుల్లారావు
15.విజయవాడ సెంట్రల్-బొండా ఉమా
16.రాజమండ్రి సిటీ-ఆదిరెడ్డి వాసు
17.తణుకు-రాధాకృష్ణ
18.హిందూపురం-నందమూరి బాలకృష్ణ
19.పెనుకొండ-సవితమ్మ
20.రాఫ్తాడు-పరిటాల సునీత
21.మండపేట-జోగేశ్వరరావు
22.రాయదుర్గం-కాలువ శ్రీనివాసులు
23.ఉరవకొండ-పయ్యావుల కేశవ్
24.నెల్లూరు రూరల్-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
25.సంతనూతలపాడు-విజయ్ కుమార్
26.కురుపాం-జగదీశ్వరి
27.నర్సీపట్నం-చింతకాయల అయ్యన్నపాత్రుడు
28.నూజివీడు-పార్థసారథి
29.గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావ్
30.కొండపి-స్వామి
31.ఆముదాలవలస-కూన రవికుమార్
32.ఆచంట-పితాని సత్యనారాయణ
33.పాలకొల్లు -రామానాయుడు
34.వినుకొండ-జీ.వీ. ఆంజనేయులు
35.జగ్గయ్యపేట-శ్రీరాంతాతయ్య
36.తాడిపత్రి-జేసీ ఆస్మిత్ రెడ్డి
37.శింగనమల-శ్రావణి
38.విజయనగరం-ఆదితి గజపతిరాజు
39.మడకశిర-సునీల్
40.కళ్యాణదుర్గం-సురేంద్రబాబు
41.సాలూరు-గుమ్మడి సంధ్యారాణి
42.బొబ్బిలి-ఆర్‌ఎస్‌వికెకె రంగారావు
43.గజపతినగరం-కొండపల్లి శ్రీనివాసరావు
44.అరకు-దున్నుదొర
45.ఆనపర్తి-నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి
46.కొత్తపేట-బండారు సత్యానందరావు
47.జగ్గంపేట- జ్యోతుల వెంకట అప్పారావు(నెహ్రు)
48.ఉండి-మంతెన రామరాజు
49.ఏలూరు-బడేటి రాధాకృష్ణ
50.చింతలపూడి- రోషన్
51.తిరువూరు-కొలికపూడి శ్రీనివాస్
52. గుడివాడ-వెనిగండ్ల రాము
53.మచిలీపట్టణం-కొల్లు రవీంద్ర
54. విజయవాడ ఈస్ట్-గద్దె రామ్మోహన్ రావు
55. పొన్నూరు-దూళిపాళ్ల నరేంద్ర
56.ప్రత్తిపాడు- బూర్ల రామాంజనేయులు
57.సత్తెనపల్లి- కన్నా లక్ష్మీనారాయణ
58.మాచర్ల-జూలకంటి బ్రహ్మనందరెడ్డి
59.ఒంగోలు-దామరచర్ల ఆంజనేయులు
60.కనిగిరి-ఉగ్ర నరసింహారెడ్డి
61.కావలి-కావ్య కృష్ణారెడ్డి
62.నెల్లూరు సిటీ-పి.నారాయణ
63.సూళ్లూరుపేట- ఎన్. విజయశ్రీ
64.ఉదయగిరి-కాకర్ల సురేష్
65. కడప- మాధవిరెడ్డి
66. రాయచోటి-ఎం. రాంప్రసాద్ రెడ్డి
67.పులివెందుల-మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
68.మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్
69.ఆళ్లగడ్డ- భూమా అఖిలప్రియ
70.శ్రీశైలం-బుడ్డా రాజశేఖర్ రెడ్డి
71.కర్నూల్-టీ.జీ. భరత్
72.నంద్యాల-ఎన్ఎండీ ఫరూక్
73.బనగానపల్లె- బీసీ జనార్ధన్ రెడ్డి
74.డోన్- కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
75.పత్తికొండ- కే.ఈ. శ్యాంబాబు
76.కోడుమూరు- బగ్గన దస్తగిరి
77.ఉరవకొండ- పయ్యావుల కేశవ్
78.తంబళ్లపల్లి-  జయచంద్రారెడ్డి
79.పీలేరు- నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
80.నగరి- గాలి భానుప్రకాష్
81.చిత్తూరు- గురజాల జగన్మోహన్
82.పలమనేరు- ఎన్. అమర్ నాథ్ రెడ్డి
83. కుప్పం- నారా చంద్రబాబునాయుడు
84.గంగాధర నెల్లూరు- డాక్టర్ వి.ఎం. థామస్
85.పాణ్యం-గౌరు చరితారెడ్డి
86.శ్రీశైలం-బుడ్డా రాజశేఖర్ రెడ్డి
87.ఎర్రగొండపాలెం-జి.ఎరిక్షన్ బాబు
88.బాపట్ల-నరేంద్ర వర్మ
89.తాడికొండ-శ్రావణ్ కుమార్
90.నందిగామ-తంగిరాల సౌమ్య
91.పామర్రు-వర్లకుమార్ రాజా
92.పెడన-కాగిత కృష్ణ ప్రసాద్
93.పి.గన్నవరం (ఎస్సీ)-రాజేష్ కుమార్
94.పాయకరావుపేట-వంగలపూడి అనిత


జనసేన అభ్యర్థుల జాబితా


నెల్లిమర్ల-మాధవి
అనకాపల్లి-కొణతాల రామకృష్ణ
తెనాలి-నాదెండ్ల మనోహర్
రాజానగరం-బత్తుల రామకృష్ణ
కాకినాడ రూరల్-పంతం నానాజీ

జనసేన 24 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను త్వరలోనే ప్రకటించనున్నట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివరించారు.  రాష్ట్రంలోని  175 అసెంబ్లీ స్థానాలున్నాయి.  అయితే  ఈ కూటమిలో బీజేపీ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో బీజేపీ కూడ ఈ కూటమిలో చేరే విషయమై అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత ఆ పార్టీకి కేటాయించే సీట్ల విషయాన్ని ప్రకటిస్తామని  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రకటించారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu