Anantapuram: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Published : Dec 06, 2021, 11:23 AM ISTUpdated : Dec 06, 2021, 11:27 AM IST
Anantapuram: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో (Anantapuram District) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.  

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో (Anantapuram District) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. జిల్లాలోని గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద బొలెరో వాహనం ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, ఐదుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటోలు ఉన్నవారిని కూలీలుగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ! ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్
Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది