2.4 కిలోల బంగారం, భారీగా నగదు: అనంతపురం ట్రెజరీ ఉద్యోగి ఆస్తుల గుర్తింపు

By narsimha lodeFirst Published Aug 19, 2020, 10:23 AM IST
Highlights

 అనంతపురం జిల్లాలోని ట్రెజరీ ఉద్యోగి మనోజ్ ఇంట్లో భారీగా ఆస్తిని అధికారులు లెక్క తేల్చారు. భారీగా నగదు, వెండి, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం  చేసుకొన్నారు.

అనంతపురం: అనంతపురం జిల్లాలోని ట్రెజరీ ఉద్యోగి మనోజ్ ఇంట్లో భారీగా ఆస్తిని అధికారులు లెక్క తేల్చారు. భారీగా నగదు, వెండి, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం  చేసుకొన్నారు. వీటితో పాటు ఆధునాతనమైన కార్లు, మోటార్ బైకులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉండే నాగలింగ అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 8 ట్రంకు పెట్టెలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఇంట్లోని ఈ ట్రంకు పెట్టెలను పాతిపెట్టారు. ట్రంకు పెట్టెలతో పాటు ఎయిర్ ఫిస్టల్ ను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

నాగలింగ అనే వ్యక్తి ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసే మనోజ్ అనే వ్యక్తి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.  బుధవారం నాడు తెల్లవారుజామున ఉదయం వరకు ట్రంకు పెట్టెలోని బంగారు ఆభరణాలు, నగదును పోలీసులు లెక్క తేల్చారు.

నాగలింగ ఇంట్లో నుండి స్వాఢీనం చేసుకొన్న ట్రంకు పెట్టెల్లో 2.4 కిలోల బంగారం, 84 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వీటితో పాటు రూ. 27 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, రూ. 49 లక్షల విలువైన పిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్టుగా  గుర్తించారు.

మనోజ్ నివాసంలో 7 అధునాతనమైన బైకులు, 3 రాయల్ ఎన్‌పీల్డ్ లు, 4 ట్రాక్టర్లను గుర్తించారు. వీటితో పాటు మరో 2 అధునాతమైన కార్లను  కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 

ఉద్యోగంలో చేరిన మూడేళ్లలోనే మనోజ్ పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఆస్తులు ఎలా సంపాదించారనే విషయమై ఆరా తీస్తున్నారు. ట్రెజరీ ఉద్యోగంలో  బిల్లులు పాస్ చేయడంలో భారీగా లంచాలు తీసుకోవడంతోనే మనోజ్ ఆస్తులు సంపాదించాడా.... రియల్ ఏస్టేట్ వ్యాపారంలో  సంపాదించాడా అనే కోణంలో కూడ దర్యాప్తు చేస్తున్నారు.

 

click me!