ఆంధ్రా కాపు యాత్ర మీద తెలంగాణా కెమెరా కన్ను

Published : Nov 15, 2016, 04:41 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
ఆంధ్రా కాపు యాత్ర  మీద తెలంగాణా కెమెరా కన్ను

సారాంశం

కాపుల పాదయాత్ర అదుపు తప్పకుండా ఉండేందుకు ఆంధ్రా   పోలీసులకు కెమెరాలను అరువిచ్చిన తెలంగాణా పోలీసులు

కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ  పద్మనాభం పాల్గొంటున్న  కాపు సత్యగ్రహ పాదయాత్ర కు వస్తున్నవారి మీద , యాత్రలొ పాల్గొంటున్న వారి మీద, చివరకు కాపు చోద్యం చేసేవారి మీద ఘట్టి నిఘావేసేందుకు రాష్ట్ర పోలీసులు సిద్దమయ్యారు. దీనికి తెలంగాణా పోలీసులు కూడా సహకరిస్తుండటం విశేషం.

 

’పోలీసు అనుమతి’ లేని పాదయాత్ర రేపు రావుల పాలెం నుంచి ప్రారంభమయి అంతర్వేది దాకా సాగుతుంది.  గతంలో తుని కాపు గర్జనలో రైలు, పోలీసు స్టేషన్ తగలబడింతర్వాత, మళ్లీ అలాంటి విధ్వంసం జరగకుండా ఉండేందుకు  తూర్పు గోదావరిజిల్లా  పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం హైదరాబాద్ పోలీసుల నుంచి వొంటి మీద ధరించే ’బాడీ వార్న్’ కెమెరాలను తెప్పించుకున్నారు.  25 కెమెరాలతో వీటిని ఎలా వాడా లోనేర్పేందుకు  కొంతమంది సిబ్బంది తూర్పుగోదావరి జిల్లాకు చేరుకున్నారు.

 

ఇండియాలో బాడీ వార్న్ కెమెరాలను మొదట వాడింది హైదరాబాద్ పోలీసులే.  దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్లి సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నపుడు  సివి ఆనంద్ కళ్లద్దాల కెమెరాలను కూడా  పోలీసులకు అందించారు.   అంతగా ప్రజా ఉద్యమాలు , ఉస్మానియా వంటి రాజకీయ విశ్వవిద్యాలయం  లేకపోవడంతో ఆంధ్ర పోలీసులకు ఈ అధునిక పరికరాల గురించిన ఆలోచన అంతగా వచ్చినట్లు లేదు.

 

హైదరాబాద్ అలా కాదు, ఎపుడూ ఉద్యమాల అంచునే ఉంటుంది. అందువల్ల హైదరాబాద్ పోలీసులు అల్ల రి అణచివేత పరికరాలన్నింటిన సమకూర్చుకున్నారు. ఇపుడివి పక్కారాష్ట్రానికి కూడా ఉపయోగపడుతున్నాయి.

 

ఛాతీమీదనో, భూజం మీదనో అమర్చుకునేందుకు వీలయ్యే ఈ కెమరాలు పోలీసులుండే దారిపోడుగునా ఏమి జరుగుతుందో కంట్రోల్ రూంకు లైవ్ అందిస్తాయని చెబుతున్నారు.

 

ఇవి డ్రోన్ లకు, ఇతర మొబైల్ కెమెరాలకు అదనం. కొత్తపేట, రాజోలు, మల్కిపురం, తాటిపాక, ఐనవల్లి, అంతర్వేది,రావుల పాలెం తదితర ప్రాంతాలలో ఈ కెమెరా నిఘా ను తీవ్రం చేశారు. అన్ని జిల్లాలనుంచి అదనపు పోలీసులను రప్పించారు. జూన్ లో ముద్రగడ దీక్ష చేస్తున్నటిలాగే ఈ సారి కూడా అయిదారు వేల మంది పోలీసులను రప్పిస్తున్నట్లు సమాచారం. జొన్నాడ వంతెనలపైనే కాకుండా రావులపాలం వచ్చేందకు అంతర్గత రోడ్లలో పోలీసు చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటుచేస్తున్నారు. అలాగే దిండి– చించునాడ వంతెన, పాశర్లపూడి వంతెన, యానాం–ఎదుర్లంక వంతెనతోపాటు సఖినేటిపల్లి, కోటిపల్లి వద్ద కూడా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 

 

ముద్రగడ పద్మనాభం రావులపాలెం- అంతర్వేది కాపు పాదయాత్ర జయప్రదం కావాలని కిర్లంపూడి శివాలయంలో సర్పంచ్‌ పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో  సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి అభిషేకాలు జరిపారు.  

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?