కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకొంది. కొత్తగా కొనుగోలు చేసిన 108 అంబులెన్స్ లో వెంటిలేటర్లను అమర్చనున్నారు. మొత్తం
సుమారు 400 అంబులెన్స్ లలో వెంటిలేటర్లను అమర్చుతారు.
అమరావతి: కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకొంది. కొత్తగా కొనుగోలు చేసిన 108 అంబులెన్స్ లో వెంటిలేటర్లను అమర్చనున్నారు. మొత్తం
సుమారు 400 అంబులెన్స్ లలో వెంటిలేటర్లను అమర్చుతారు.
అదే విధంగా 104 వాహనాల్లో కూడ ఏఎల్ఎస్ ( అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్) వాహనాలుగా మార్చుతున్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. కరోనాతో పాటు ఇతరత్రా సమయాల్లో రోగులను కాపాడేందుకు అత్యవసరంగా ఆసుపత్రులకు తరలించే వాహనాల్లో అత్యాధునిక పరికరాలను అమర్చుతున్నారు.
undefined
also read:గుంటూరు రెడ్‌జోన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఐకి కరోనా: కుటుంబ సభ్యులు క్వారంటైన్ కి
కొత్తగా 400 అంబులెన్స్ లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. 'రెస్‌మెడ్' నుండి కొనుగోలు చేసిన మొబైల్ వెంటిలేటర్లను 108 అంబులెన్స్ లలో అమర్చనున్నారు. 104 వాహనాల్లో వెంటిలేటర్ తో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చిన సమయంలో కాపాడే యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీన్ని డిఫ్రిబ్యులేటర్ అని పిలుస్తారు. దీంతో పాటు అత్యాదునికమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
పారిశుద్య పనులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కిట్లను అందజేయనుంది. ఈ మేరకు రూ. 3.84కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కరోనా సమయంలో పారిశుద్య సేవలు చేస్తున్న 19,584 మంది పారిశుద్య కార్మికులకు ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫాం, టోపి, రెండు జతల బ్లాక్ గమ్ షూ, యూనిఫాం మీద వేసుకొనేందుకు కోటు కూడ ఇవ్వనుంది.