మా కూతురిని చంపేస్తాం అనుమతివ్వండి... కోర్టును కోరిన తల్లిదండ్రులు

By telugu teamFirst Published Oct 11, 2019, 2:04 PM IST
Highlights

చిన్నారి పుట్టినప్పటి నుంచి శ్వాసకోస సమస్యతో బాధపడుతోంది. చిన్నారిని బ్రతికించుకునేందుకు దంపతులు ఇప్పటికే తమకు ఉన్న ఎకరం పొలాన్ని అమ్మి.. చికిత్స కోసం రూ.12లక్షలు ఖర్చు చేశారు.

మా కూతురిని మేము చంపేయాలని అనుకుంటున్నాము, మాకు అనుమతి ఇవ్వండి అంటూ ఓ తల్లిండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

చిత్తూరు జిల్లాకు చెందిన భావజాన్, షబీర్ లకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి సంవత్సరం వయసుగల సుహానా అనే కుమార్తె ఉంది. భార్యభర్తలు ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా... ఆ చిన్నారి పుట్టినప్పటి నుంచి శ్వాసకోస సమస్యతో బాధపడుతోంది. చిన్నారిని బ్రతికించుకునేందుకు దంపతులు ఇప్పటికే తమకు ఉన్న ఎకరం పొలాన్ని అమ్మి.. చికిత్స కోసం రూ.12లక్షలు ఖర్చు చేశారు.

అంత ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు. చిన్నారి చికిత్సకు ఇంకా ఖర్చు చేయాల్సి ఉంది. తమ దగ్గర ఉన్నదంతా ఇప్పటికే ఖర్చు చేయడంతో...వారి దగ్గర రూపాయి కూడా మిగలలేదు. దీంతో ఆ దంపతులు ఇద్దరూ మదనపల్లి పట్టణంలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తాము తమ కుమార్తెను చంపేయాలనుకుంటున్నామని... ఆమెకు చికిత్స అందించే స్థోమత తమ వద్ద లేదని అందుకు అనుమతి ఇవ్వాలని వారు కోరారు. చికిత్స చేయించేలకపోతే ఎలాగూ తమ చిన్నారి చనిపోతుందని వారు పేర్కొన్నారు. జబ్బుతో తమ కుమార్తె రోజూ ప్రాణాలతో పోరాడటం తాము  చూడలేకపోతున్నామని వారు పేర్కొన్నారు. వీరు వేసిన పిటిషన్ ని కోర్టు స్వీకరించాల్సి ఉంది. 

click me!