అనంతపురం డిఎంహెచ్‌ఓకు అస్వస్థత: మీడియాపై కుటుంబసభ్యులు సీరియస్

By narsimha lode  |  First Published Apr 10, 2020, 6:22 PM IST

పొరపాటున ఫార్మాల్డిహైడ్ కలిపిన వాటర్ ను తాగిన అనంతపురం జిల్లా వైద్యాశాఖాధికారి శుక్రవారం నాడు అస్వస్థతకు గురయ్యాడు.ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.


అనంతపురం: పొరపాటున ఫార్మాల్డిహైడ్ కలిపిన వాటర్ ను తాగిన అనంతపురం జిల్లా వైద్యాశాఖాధికారి శుక్రవారం నాడు అస్వస్థతకు గురయ్యాడు.ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.

అనంతపురం జిల్లా వైద్యాధికారి అనిల్ కుమార్  పొరపాటున శానిటైజర్ తాగినట్టుగా మీడియాలో వార్తలు రావడంపై ఆయన కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు

Latest Videos

తన కుటుంబంలో జరిగిన దురదృష్టకర సంఘటనపై మీడియా తప్పుగా నివేదించాయని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అంతేకాదు ఈ రాతలు అన్యాయమైనవిగా అభిప్రాయపడ్డారు.

మీడియాలో తప్పుడు వార్తలు రావడంతో తమ కుటుంబసభ్యులను  మానసికంగా ఇబ్బందికి గురి చేసిందని  అనుహ్య కొర్రపాటి ట్వీట్ చేశారు. ఈ తప్పుడు వార్తలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు,దురదృష్టకరమైన ఘటన  జరిగిన సమయంలో  తప్పుడు వార్తతో తమను మరింత కుంగదీశారన్నారు. 

ఇది ఆత్మహత్యాయత్నం కాదన్నారు. మంచినీళ్లు అనుకొని పొరపాటున ఈ నీటిని తాగినట్టుగా ఆమె ఆ ట్వీట్ లో వివరించారు. జిల్లాలో ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పారు.
 

click me!