అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి అనంత వెంకట్రామిరెడ్డి, టీడీపీ నుంచి దగ్గుబాటి ప్రసాద్ ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో ఎవరు విన్ అనేది మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది.
సీజన్‌తో సంబంధం లేకుండా అనంతపురం రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే సాగుతాయి. ఫ్యాక్షన్‌కు కేంద్రంగా నిలిచిన ఈ గడ్డ ఎందరో ఉద్దండులను దేశానికి అందించింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఏర్పడింది. పూర్తిగా పట్టణ ప్రాంత పరిధిలో వుండే ఈ సెగ్మెంట్లో రెడ్డి, బలిజ, మైనారిటీ, దళిత , బీసీ వర్గాలు బలంగా వున్నాయి. 2009లో కాంగ్రెస్ తరపున గురునాథ రెడ్డి విజయం సాధించారు. వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరిన ఆయన 2012 ఉపఎన్నికలోనూ గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి ప్రభాకర్ చౌదరి గెలుపొందారు. 2019లో వైసీపీ తరపున పోటీ చేసిన అనంత వెంకట్రామిరెడ్డి విజయం సాధించారు.
అనంతపురం అర్బన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 ..
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి అనంత వెంకట్రామిరెడ్డికి 88,704 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి ప్రభాకర్ చౌదరికి 60,006 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 10,920 ఓట్ల తేడాతో విజయం సాధించింది. అనంతపురం అర్బన్‌లో మరోసారి గెలిచి తీరాలని జగన్ పట్టుదలతో వున్నారు. దీనిలో భాగంగా వెంకట్రామిరెడ్డికి మరోసారి టికెట్ కేటాయించారు. టీడీపీ నుంచి దగ్గుపాటి ప్రసాద్ కూటమి నుంచి బరిలో నిలిచారు. సీపీఐ నుంచి సి జాఫర్ పోటీ చేస్తున్నారు. 2014 ఫలితాల్లో ఎవరు విన్ అనేది తేలాల్సి ఉంది.