మంత్రాలయం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live 

By Sambi Reddy  |  First Published Jun 4, 2024, 8:24 AM IST

ఆధ్యాత్మికంగానూ, రాజకీయంగానూ మంత్రాలయానికి ప్రత్యేక స్థానం వుంది. రాయలసీమ ప్రాంతం కావడంతో నియోజకవర్గంలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కూడా వున్నాయి. 2019 ఎన్నికల్లో ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్ధికి బుల్లెట్ గాయం కావడం అప్పట్లో రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి బాలనాగిరెడ్డి మాత్రమే గెలుస్తున్నారు. 2009లో టీడీపీ తరపున విజయం సాధించిన ఆయన.. 2014, 2019లలో వైసీపీ అభ్యర్ధిగా గెలిచారు. టీడీపీలో బాలనాగిరెడ్డికి చెక్ పెట్టగల నేత దొరకడం లేదు. టీడీపీ విషయానికి వస్తే.. నియోజకవర్గం ఏర్పడిన తొలి ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ మళ్లీ గెలవలేదు. ఈసారి రాఘవేంద్రా రెడ్డికి చంద్రబాబు టికెట్ కేటాయించారు. 
 


తెలుగునాట ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది మంత్రాలయం. పవిత్ర తుంగభద్ర నది ఒడ్డున, శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనంతో భక్తులు పులకించిపోతున్నారు. ప్రతినిత్యం దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు మంత్రాలయం చేరుకుని స్వామివారి దర్శనంతో పునీతమవుతున్నారు. ఆధ్యాత్మికంగానూ, రాజకీయంగానూ మంత్రాలయానికి ప్రత్యేక స్థానం వుంది. పక్కనే కర్ణాటక సరిహద్దు వుండటంతో మిక్స్‌డ్ కల్చర్ ఈ ప్రాంతంలో నడుస్తుంది. రాయలసీమ ప్రాంతం కావడంతో నియోజకవర్గంలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కూడా వున్నాయి. 2019 ఎన్నికల్లో ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్ధికి బుల్లెట్ గాయం కావడం అప్పట్లో రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. 

మంత్రాలయం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. బాలనాగిరెడ్డి హ్యాట్రిక్ :

Latest Videos

undefined

ఎమ్మిగనూరు నుంచి మంత్రాలయం, పెద్దకడుబూరు, కోసిగి మండలాలను.. ఆదోని నుంచి కౌతాళం మండలాన్ని కలిపి మంత్రాలయం నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 1,87,011 మంది. మంత్రాలయంలో దాదాపు 60 శాతం మంది బోయ కమ్యూనిటీకి చెందినవారే. దాదాపు లక్షా 10 వేల మంది ఓటర్లు వారే. జనాభాలో బలంగా వున్నా.. పవర్ మాత్రం రెడ్డి సామాజికవర్గం చేతుల్లోనే వుంటుంది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి బాలనాగిరెడ్డి మాత్రమే గెలుస్తున్నారు. 2009లో టీడీపీ తరపున విజయం సాధించిన ఆయన.. 2014, 2019లలో వైసీపీ అభ్యర్ధిగా గెలిచారు. టీడీపీలో బాలనాగిరెడ్డికి చెక్ పెట్టగల నేత దొరకడం లేదు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బాలనాగిరెడ్డికి 86,896 ఓట్లు.. వైసీపీ అభ్యర్ధి పీ తిక్కారెడ్డికి 63,017 ఓట్లు పోలయ్యాయి. దాదాపు 23,879 ఓట్ల మెజారిటీతో బాలనాగిరెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. 

మంత్రాలయం శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. ఈసారి పట్టు సాధించాలని టీడీపీ :

2024 అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే.. వైసీపీ నుంచి బాలనాగిరెడ్డికి టికెట్ కేటాయించారు జగన్. మంత్రాలయంలో వైసీపీ పట్టును నిలపాలని ఆయన భావిస్తున్నారు. నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయడం, అందరికీ అందుబాటులో వుంటారనే నేతగా పేరుండటంతో బాలనాగిరెడ్డికి ఎదురులేకుండా పోతోంది. టీడీపీ విషయానికి వస్తే.. నియోజకవర్గం ఏర్పడిన తొలి ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ మళ్లీ గెలవలేదు. ఈసారి రాఘవేంద్రా రెడ్డికి చంద్రబాబు టికెట్ కేటాయించారు. నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు ఓడిపోయిన సానుభూతి, టీడీపీ జనసేన బీజేపీ కూటమి కారణంగా తాను గెలుస్తానని రాఘవేంద్ర రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 

click me!