మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం... జిమ్ ట్రైనర్ అరెస్ట్

Published : Jun 29, 2021, 11:37 AM ISTUpdated : Jun 29, 2021, 11:43 AM IST
మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం... జిమ్ ట్రైనర్ అరెస్ట్

సారాంశం

అనంతపురం పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికను మోసం చేసిన జిమ్ ట్రైనర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

అనంతపురం: మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్న ఓ జిమ్ ట్రైనర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక తల్లిదండ్రుల పిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో చట్టం, కిడ్నాప్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

వివరాల్లోకి వెళితే... అనంతపురం పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికను జిమ్ ట్రైనర్ అభిరామ్ ప్రేమ పేరిట మోసం చేశారు. బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఈ నెల 17న బాలికను కర్నూల్ కు తీసుకెళ్లి వారం రోజుల తర్వాత తీసుకువచ్చాడు. అతడి చేతిలో మోసపోయిన బాలిక తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

read more  వివాహేతర సంబంధం: కన్నకొడుకును హత్య చేయించిన తల్లి

దీంతో రంగంలోకి దిగిన అనంతపురం త్రీటౌన్ పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మైనర్ ను మోసం చేసిన అతడికి తగిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu