ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్

By narsimha lodeFirst Published Aug 7, 2020, 6:10 PM IST
Highlights

టీడీపీనేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు.

అనంతపురం: టీడీపీనేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అనంతపురం పోలీసులు ఇవాళ సాయంత్రం ఆయనను అరెస్ట్ చేశారు.  కడప నుండి అనంతపురం వస్తున్న సమయంలో సీఐ దేవేంద్రకుమార్ తో వాగ్వాదానికి దిగాడు.అనంతపురం: టీడీపీనేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అనంతపురం పోలీసులు ఇవాళ సాయంత్రం ఆయనను అరెస్ట్ చేశారు.  కడప నుండి అనంతపురం వస్తున్న సమయంలో సీఐ దేవేంద్రకుమార్ తో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయంలో దేవేంద్రకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం నాడు కేసు పెట్టారు.

తాడిపత్రికి సమీపంలోని బొందలదిన్నె వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి సీఐ దేవేంద్రకుమార్ తో గొడవకు దిగారు. సీఐతో జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడని ఆయన ఆరోపించారు.

సీఐ దేవేంద్రకుమార్ ఫిర్యాదుతో తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో పోలీసులు శుక్రవారం నాడు కేసు నమోదు చేశారు. మరో వైపు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని కడప  పోలీసులు కూడ గురువారం నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డిపై కేసు పెట్టారు. వీరితో పాటు మరో 31 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారు.

బెయిల్ పై విడుదలైన సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు భారీ ఎత్తున అనంతపురం నుండి కడపకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని ఆయనపై కేసులు పెట్టారు.

కండిషన్ బెయిల్ పై విడుదలైన సందర్భంగా   ఇవాళ అనంతపురం పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టేందుకు వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలు ఇంకా అనంతపురం వన్ టౌన్ పోలిస్ స్టేషన్ లోనే ఉన్నారు. సాయంత్రం జేసీ ప్రభాకర్ రెడ్డిని శుక్రవారం నాడు అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు.

టపాకాయలు కాల్చడంతో పాటు ఇతర కేసులను కూడ జేసీ ప్రభాకర్ రెడ్డి సహా పలువురిపై ఇతర సెక్షన్ల కింద కూడ కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. 

click me!