'చచ్చిపోయిన' వ్యక్తి రెండేళ్ల తర్వాత ప్రత్యక్షం

By narsimha lodeFirst Published May 14, 2019, 3:44 PM IST
Highlights

చనిపోయాడనుకొన్న ఓ వ్యక్తి రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకొంది.2017 మార్చి 19 వ తేదీన తలారి శ్రీనివాసులు అనే వ్యక్తి అదృశ్యమయ్యారు

అనంతపురం:  చనిపోయాడనుకొన్న ఓ వ్యక్తి రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకొంది.2017 మార్చి 19 వ తేదీన తలారి శ్రీనివాసులు అనే వ్యక్తి అదృశ్యమయ్యారు ఈ నెల 11వ తేదీన ఆయన తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.

చెన్నెకొత్తేపల్లి మండలంలోని హరియాన్ చెరువు గ్రామానికి చెందిన వాడు తలారి శ్రీనివాసులు. శ్రీనివాసులు భార్య చిలకమ్మ, శ్రీనివాసులు మామ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసులు కట్టెకిందిపల్లికి సమీపంలోని రైసుమిల్లులో పనిచేసేవాడు. శ్రీనివాసులు, చిలకమ్మ దంపతులకు ఓ కొడుకు కూడ ఉన్నాడు.

2017 ఏప్రిల్ 4వ తేదీన పెనుకొంద మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌ వద్ద ఓ  మృతదేహాం లభ్యమైంది. ఈ మృతదేహాన్ని శ్రీనివాసులు మృతదేహాంగా భావించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే  ఈ విషయంలో రాజకీయ ఒత్తిడి కారణంగానే తాము ఈ మృతదేహాన్ని శ్రీనివాసులు మృతదేహాంగా ఒప్పుకొన్నట్టుగా బాధిత కుటుంబం ఆరోపణలు చేస్తోంది.

ఈ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. చిలకమ్మ కూలీ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తోంది.  ఈ నెల 11వ తేదీన శ్రీనివాసులు ధర్మవరంలో ప్రత్యక్షమయ్యాడు. స్థానికులు అతడిని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.

చెన్నేకొత్తేపల్లి సీఐ తేజోమూర్తి, తహాసీల్దార్ లు కలిసి శ్రీనివాసులును ఆయన భార్య చిలకమ్మ, ఆయన తండ్రి ముత్యాలప్పకు అప్పగించారు.

అయితే శ్రీనివాసులు మృతదేహంగా భావించి అంత్యక్రియలు నిర్వహించిన  శవం ఎవరిదనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేయనున్నారు. 

తనకు ఉన్న ఆర్థిక, కుటుంబసమస్యల కారణంగా బెంగుళూరుకు పారిపోయినట్టుగా శ్రీనివాసులు చెప్పారు.  బెంగుళూరులోని ఓ హోటల్‌లో క్లీనర్‌గా పనిచేసినట్టుగా ఆయన తెలిపారు.

తాము అంత్యక్రియలు నిర్వహించిన శ్రీనివాసులు మృతదేహం తన భర్తది కాదని ఆనాడే తాను చెప్పినా కూడ ఒప్పుకోలేదని.. బలవంతంగా ఈ మృతదేహాం తన భర్తదే అని ఒప్పించారని చిలకమ్మ వాపోయింది.

click me!