యువతి కిడ్నాప్‌ కేసులో భగీరథ ఆచారీతో సహా 10 మంది అరెస్ట్‌

Bukka Sumabala   | Asianet News
Published : Nov 07, 2020, 11:12 AM IST
యువతి కిడ్నాప్‌ కేసులో భగీరథ ఆచారీతో సహా 10 మంది అరెస్ట్‌

సారాంశం

అనంతపురం జిల్లాలో కలకలం రేపిన యువతి కిడ్నాప్‌ కేసులో పోలీసులు మరో ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. ఇప్పటివరకు కానిస్టేబుల్ భగీరథ ఆచారితో సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.   

అనంతపురం జిల్లాలో కలకలం రేపిన యువతి కిడ్నాప్‌ కేసులో పోలీసులు మరో ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. ఇప్పటివరకు కానిస్టేబుల్ భగీరథ ఆచారితో సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకున్న కానిస్టేబుల్ స్నేహితుల సహాయంతో ఆమెను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెడితే కానిస్టేబుల్‌ భగీరథ ఆచారీ, జ్యోతిల నిశ్చితార్థం అయ్యాక ఇరు కుటుంబాల మధ్య గొడవలు రావడంతో పెళ్లి రద్దయ్యింది. 

కానీ భగీరథ ఆచారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను జ్యోతినే వివాహం చేసుకోవాలనుకున్నాడు దీంతో ఈ నెల 2న టైలర్‌ షాపుకు వెళ్లిన జ్యోతిని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అలర్ట్‌ ప్రకటించారు. 

తాడిపత్రి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండడాన్ని గమనించిన భగీరథ ఆచారి తదితరులు స్కార్పియో వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లి, మరో జిస్ట్‌ వాహనంలో వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి అవుకు, తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. 

మంగళవారం కోవెలకుంట్ల మార్గంలో కానిస్టేబుల్‌ భగీరథ ఆచారి, జ్యోతిలను బనగానిపల్లి సీఐ అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి స్టేట్‌మెంట్‌ ఆధారంగా చర్యలు ప్రారంభించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఏడుగురు పరారీలో ఉండగా.. పోలీసులు వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

PREV
click me!

Recommended Stories

కడప జిల్లా ఉన్నత పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పిన లోకేష్| Nara Lokesh Visit Proddatur ZP High School
భీమవరం బహిరంగ సభకు సినిమా రేంజ్ లో జగన్ ఎంట్రీ | YS Jagan Bhimavaram Tour