ఆయుర్వేద మందుపై రచ్చ.. కాకానికి ఆనందయ్య బాసట, సోమిరెడ్డిపై విమర్శలు

Siva Kodati |  
Published : Jun 05, 2021, 07:53 PM ISTUpdated : Jun 05, 2021, 07:54 PM IST
ఆయుర్వేద మందుపై రచ్చ.. కాకానికి ఆనందయ్య బాసట, సోమిరెడ్డిపై విమర్శలు

సారాంశం

ఆయుర్వేద మందుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి మధ్య వివాదం నేపథ్యంలో ఆనందయ్య స్పందించారు. సోమిరెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాకానిపై సోమిరెడ్డి వ్యాక్యలు అర్థరహితమన్నారు. 

ఆయుర్వేద మందుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి మధ్య వివాదం నేపథ్యంలో ఆనందయ్య స్పందించారు. సోమిరెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాకానిపై సోమిరెడ్డి వ్యాక్యలు అర్థరహితమన్నారు. 

అంతకుముందు ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేదం మందును వైసీపీ నేతలు అమ్ముకోవడానికి చూస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చిల్‌డీల్.కామ్ వెబ్‌సైట్‌ను గో డాడీ సంస్థ నుంచి శేషిత టెక్నాలజీ కొనుగోలు చేసిందన్నారు. ఆనందయ్య తయారు చేసే మూడు మందుల్ని ఒక్కో దానిని ఒక్కో రేటుకు అమ్ముకోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు.

Also Read: వెబ్‌సైట్ నకిలీది.. ఆనందయ్య మందును అమ్ముకోవాలని స్కెచ్, ఇవిగో ఆధారాలు: సోమిరెడ్డి

దీనిపై రేపు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సోమిరెడ్డి స్పష్టం చేశారు. మందు అమ్మకాన్ని ఆనందయ్య ఒప్పుకోలేదని.. ఆ నకిలీ వెబ్‌సైట్‌ను నమ్మొద్దని ఆనందయ్య తనయుడు స్వయంగా చెప్పారని చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఓ కుటుంబం తయారు చేసిన మందును కాకాని గోవర్థన్ రెడ్డి ఎలా అమ్ముతారని ఆయన ప్రశ్నించారు. నకిలీ వెబ్‌సైట్ క్రియేట్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

ఉచిత మందుకు డోర్ డెలివరీ పేరుతో కుంభకోణానికి తెరదీశారని ఆయన ఆరోపించారు. ఆనందయ్య మందుతో కాకాని లబ్ధిపోందాలని చూస్తున్నారని సోమిరెడ్డి విమర్శించారు. ఉచిత మందును 167 రూపాయలకు అమ్ముకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే సోమిరెడ్డి ఆరోపల్ని ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి ఖండించారు. సోమిరెడ్డివి పనీ, పాటలేని ఆరోపణలని వ్యాఖ్యానించారు. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Visits Kakinada GGH Firecracker Blast Victims | Asianet News Telugu
Chitha Vijay Prathap Reddy: అంగన్వాడీ అంటే ఇలా ఉండాలి: ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ప్రశంసలు | Asianet Telugu