ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు: కొత్తగా 10,373 మందికి పాజిటివ్, తూ.గోలో అత్యధికం

Siva Kodati |  
Published : Jun 05, 2021, 06:56 PM IST
ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు: కొత్తగా 10,373 మందికి పాజిటివ్, తూ.గోలో అత్యధికం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 10,373 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 17,49,363కి చేరుకుంది


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 10,373 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 17,49,363కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 80 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 11,376కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 9, ప్రకాశం 8, అనంతపురం 9, తూర్పుగోదావరి 5, చిత్తూరు 12, గుంటూరు 5, కర్నూలు 6, నెల్లూరు 6, కృష్ణ 4, విశాఖపట్నం 5, శ్రీకాకుళం 9, పశ్చిమ గోదావరి 6, ప్రకాశం 3, కడపలో ఒకరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 15,958 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 16,09,879కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 88,411 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,97,08,031కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,28,108 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1002, చిత్తూరు 1728, తూర్పుగోదావరి 1880, గుంటూరు 691, కడప 475, కృష్ణ 511, కర్నూలు 505, నెల్లూరు 459, ప్రకాశం 659, శ్రీకాకుళం 383, విశాఖపట్నం 693, విజయనగరం 309, పశ్చిమ గోదావరిలలో 1078 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?