తెలుగు రాష్ట్రాలకు అంబానీ ఫ్యామిలీ ఎంత ఇచ్చిందో తెలుసా?

By Galam Venkata RaoFirst Published Sep 28, 2024, 10:07 AM IST
Highlights

Ambani family donation: ఇటీవలి వరదలు తెలుగు రాష్ట్రాలను కుదిపేశాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో అనేక ప్రాంతాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. భారీగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు దాతలకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ తరఫున అంబానీ కుటుంబం రెండు రాష్ట్రాలకు భారీగా ఆర్థిక సాయం అందించింది.

Ambani family donation: ఆసియా కుబేరుల్లో ఒకరైన అంబానీ ఫ్యామిలీ అనేక సందర్భాల్లో తమ దాతృత్వాన్ని చాటుకుంది. తాజాగా కష్టాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలకు బాసటగా నిలిచింది. ఇటీవలి వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు భారీగా ఆర్థిక సాయం అందించింది మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు ముఖేశ్‌- నీతా అంబానీ ఫ్యామిలీ..... 

తెలుగు రాష్ట్రాలను ఇటీవల భారీ వర్షాలు, వరదలు కుదిపేశాయి. వరద నీరు ముంచెత్తడంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో అనేక ప్రాంతాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ప్రభుత్వాలు వరద నివారణ చర్యలు చేపట్టినా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం తప్పలేదు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో వందలాది ఇళ్లు నేలమట్టం కాగా, వేల కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో బాధిత ప్రజలు, రైతులను ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసానిచ్చాయి. 

Latest Videos

తెలంగాణకు అంబానీ ఫ్యామిలీ భారీ సాయం

వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను ఆదుకునేందుకు అనేక మంది దాతలు ముందుకు వచ్చారు. సినీ రంగ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వివిధ సంఘాలు వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు విరివిగా విరాళాలు అందించారు. ఏపీకి వరద సాయంగా 400కోట్ల రూపాయలకు విరాళాలు అందినట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు. ఆ తర్వాత కూడా దాతలు ఒక్కరొక్కరుగా సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు.  

ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బాసటగా నిలిచేందుకు అంబానీ కుంటుంబం ముందుకు వచ్చింది. రిలయన్స్‌ ఫౌండేషన్‌ తరఫున ఏపీ, తెలంగాణకు భారీగా విరాళం అందించింది. తాజాగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని నీతా అంబానీ తరఫున రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & బోర్డు సభ్యులు పీఎంఎస్ ప్రసాద్, ఆ సంస్థ ఏపీ తెలంగాణాల మెంటార్ పీవీఎల్‌ మాధవరావు కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి 20 కోట్ల రూపాయల భూరి విరాళం అందజేశారు. 

ఆంధ్రప్రదేశ్‌కి రిలయన్స్ ఫౌండేషన్ సాయం ఎంతంటే?

అలాగే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా రిలయన్స్‌ ఫౌండేషన్‌ భారీ విరాళం అందించింది. ఇప్పటికే ఏపీకి వరద సాయం కింద ముఖ్య‌మంత్రి సహాయ‌నిధికి విరాళాల వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా దాత‌లను సీఎం చంద్ర‌బాబు నాయుడు పలుమార్లు అభినందించారు. తాజాగా నీతా అంబానీ, రిల‌య‌న్స్ ఫౌండేష‌న‌న్  త‌ర‌ఫున రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ బోర్డు మెంబ‌ర్ ఎంపీఎస్ ప్ర‌సాద్‌, ఆ సంస్థ ఏపీ తెలంగాణాల మెంటార్ పీవీఎల్ మాధ‌వరావ్‌లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌ తరఫున 20 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.

ఏపీ వరద బాధితులకు ఇంకా ఎవరెవరు ఎంత సాయం చేశారు?

వీరితో పాటు మరికొందరు ఏపీకి వరద బాధితుల సహాయార్థం నిధులు అందజేశారు. ఐటీసీ గ్రూపు ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ రూ.2 కోట్లు, ఎల్జీ పాలిమ‌ర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్ర‌తినిధి కె.రాణా రూ.2 కోట్లు, సాగ‌ర్ గ్రంథి ఎక్స్‌పోర్ట్సు ప్రైవేటు లిమిటెడ్‌, చెన్నై ఎండీ జీ.గ్రంథి చెల్లారావ్ కోటి రూపాయలు, ఆర్కియ‌న్ కెమిక‌ల్ ఇండ‌స్ట్రీస్‌ తరఫున ఆర్కియ‌న్ ఫౌండేష‌న్ నిర్వాహ‌కులు పెందుర్తి ప్ర‌మీల‌, ఆమె త‌న‌యుడు పెందుర్తి రంజిత్‌లు కోటి రూపాయలు, 6. ఉంగ‌టూరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌ల త‌ర‌ఫున ఎమ్మెల్యే ప‌త్స‌మ‌ట్ల ధ‌ర్మ‌రాజు 84.83 ల‌క్ష‌ల రూపాయలు,  బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయ‌న‌, మాజీ మంత్రి సుజ‌య్‌కృష్ణ‌ రంగారావులు 71.50 ల‌క్ష‌ల రూపాయలు,  శ్రీవిద్యానికేత‌న్ ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్టు త‌ర‌ఫున సినీ న‌టుడు మంచు మోహ‌న్ బాబు, మంచు విష్ణులు 25 ల‌క్ష‌లు, ఎం. రాంప్రసాద్ 8 ల‌క్ష‌లు, వి.వెంక‌టేశ్వ‌ర‌రావు రూ.8 ల‌క్ష‌లు, మండ‌ల స‌మాఖ్య, బాపట్ల 6.20 ల‌క్ష‌లు విరాళమిచ్చారు.

వీరితో పాటు మ‌హాప్ర‌స్తాన్ సేవా స‌మితి 6.10 ల‌క్ష‌లు, శ్రీకాకుళం డీసీసీబీ తరఫున ఎన్‌.శ్రీనివాస‌రావు 5 ల‌క్ష‌లు, శ్రీ ఇందూ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ 5 ల‌క్ష‌లు, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా 4 ల‌క్ష‌లు, బాప‌ట్ల జిల్లా పిట్ల‌వానిపాలెం మండ‌ల స‌మాఖ్య‌ తరఫున 2.92 ల‌క్ష‌లు, జి. ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి 2.50 ల‌క్ష‌లు, ర‌వి గోపాల‌కృష్ణ 2.30 ల‌క్ష‌లు అందజేశారు. ఇలా అనేక మంది వరద బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చి దాతృత్వం చాటుకుంటున్నారు.

click me!