కాపుల‌తో పార్టీకి గ్యాప్ పెరిగింది నిజ‌మే కానీ.. : టీడీపీ నేత నిమ్మకాయల‌‌ చినరాజప్ప

By Mahesh RajamoniFirst Published Apr 1, 2023, 4:52 PM IST
Highlights

Amaravati: తెలుగు దేశం పార్టీ స్థాప‌న నుంచి కాపులు, బీసీలు పార్టీకి అండ‌గా ఉన్నారు కానీ, న‌టుడు చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ విష‌యంలో కొంత గ్యాప్ వచ్చిందని తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు నిమ్మకాయల‌‌ చినరాజప్ప పేర్కొన్నారు.
 

TDP leader Nimmakayala Chinarajappa:  తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావం నుంచి కాపులు, బీసీలు పార్టీగా అండ‌గా ఉన్నార‌ని  ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు నిమ్మకాయల‌‌ చినరాజప్ప అన్నారు. అయితే, న‌టుడు చిరంజీవి కొత్త రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేసిన త‌ర్వాత ఈ విష‌యంలో కొంత గ్యాప్ వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. అప్ప‌ట్లో చంద్ర‌బాబు అందించిన పాల‌న‌ను ఆయ‌న గుర్తు చేశారు. చంద్ర‌బాబు నాయుడు ఆనాడు పాదయాత్ర చేస్తూ కాపులకు రిజర్వేషన్ కు సంబంధించిన హామీల‌ను సైతం ఇచ్చార‌ని ఆయ‌న గుర్తు చేశారు. 

తెలుగుదేశం పార్టీ మెరుగైన పాల‌న అందించింద‌ని తెలిపారు. టీడీపీ పాల‌న‌ను కాపులకు స్వర్ణ యుగంగా పేర్కొన్నారు. పార్టీకి వారు ఇప్ప‌టికీ అండ‌గా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నార‌నీ, కాపులకు రిజర్వేషన్‌ ఇచ్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంద‌ని నిమ్మకాయల‌‌ చినరాజప్ప అన్నారు. అలాగే, కాంపు సంఘాల నాయ‌కుల‌తో వెళ్లి చంద్ర‌బాబుతో స‌మావేశ‌మ‌వుతామ‌నీ, దీనిలో భాగంగా ఈ వ‌ర్గాలు ఎదుర్కొంటున్న సమ‌స్య‌లు గురించి వివ‌రిస్తామ‌ని చెప్పారు.

Latest Videos

click me!