కన్నాతో గంటా శ్రీనివాస్ భేటీ.. పొత్తులు, సీట్ల వ్యవహారాలపై ఏం చెప్పారంటే..

By Sumanth KanukulaFirst Published Apr 1, 2023, 4:38 PM IST
Highlights

టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు  భేటీ అయ్యారు. గుంటూరులోని కన్నా నివాసంలో ఇరువురు  నేతల మధ్య సమావేశం జరిగింది.

టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు  భేటీ అయ్యారు. గుంటూరులోని కన్నా నివాసంలో ఇరువురు  నేతల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలను నేతలు చర్చించారు. ఈ సమావేశం అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులు, సీట్లు వ్యవహారాలు ఎన్నికల సమయంలోనే చెబుతామని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్స్ అన్న వారు ఎటు వెళ్లారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి రాజధానికి రిఫరెండం అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని.. టీడీపీ అభ్యర్థి చిరంజీవి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారని అన్నారు. అక్కడ రాజధానికి మద్దతు లేదని తేలిందని  అన్నారు. 

పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ అనేక అక్రమాలు పాల్పడిందని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఎన్నో విధాలుగా ప్రలోభాలు గురిచేశారని.. అయినప్పటికీ ప్రజలు వాటిని లెక్కచేయకుండా స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, టీడీపీపై అనుకూలత స్పష్టంగా తెలిసిందని అన్నారు. పొత్తులు, సీట్లు వ్యవహారాలు ఎన్నికల సమయంలోనే మాట్లాడుతామని అన్నారు. ప్రజల  మూడ్ కూడా.. అధికార వైసీపీకి వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్షాలు ఒకే వేదికపైకి రావాలని ఉందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుంట ఉంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

కన్నా  లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. నిన్న రాజధానిలో దాడుల వెనక కూడా ప్రభుత్వం పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. మూడు రాజధాలకు మద్దతు ఉండదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పట్ల క్షేత్ర స్థాయిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 

click me!