ఆ మంత్రి దుమ్ము దులుపుతాం: చీపుర్లతో అమరావతి మహిళల నిరసన (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 9, 2020, 2:07 PM IST
Highlights

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం మహిళా జేఎసి నాయకులు మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. 

విజయవాడ: అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం మహిళా జేఎసి నాయకులు మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. అమరావతి గురించి మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ చీపుర్లతో నిరసన తెలిపారు.

అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారి దుమ్ము దులుపుతాం... అమరావతి మార్చాలనే ప్రభుత్వం దుమ్ము దులుపుతామని హెచ్చరించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని... రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని..5 కోట్ల మంది రాజధాని అమరావతి...  పరిపాలన అంతా అమరావతి నుండే కొనసాగాలంటూ మహిళలు నినాదాలు చేశారు. 

వీడియో

"

ఈ సందర్భంగా మహిళా జేఏసి నాయకురాలు గద్దె అనూరాధ మాట్లాడుతూ... 5 కోట్ల రాష్ట్ర ప్రజల కలే రాజధాని అమరావతి అని అన్నారు. చంద్రబాబు నాయుడు  అమరావతి అనే ఫలాలు ఇచ్చే మొక్కను నాటితే జగన్మోహన్ రెడ్డి ఆ ఫలాలు ప్రజలకు చేరకుండా నాశనం చేస్తున్నారని అన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెబితే ఎవరు అడ్డుపడ్డారు అని ఆమె ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి కక్ష, విద్వంసంతో ముందుకు వెళితున్నారని... అలాగే ప్రజలను దారి మళ్లించడానికి మంత్రులతో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని అన్నారు. 

మరో నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ... అమరావతి గురించి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడికపోతే నాలుకులు కొస్తామని హెచ్చరించారు. మహిళలు వేదన మీకు శాపమై తగులుతుందని అన్నారు. నాలుకులు అదుపులో పెట్టుకోకపోతే గొంతులు కొస్తామంటూ పద్మశ్రీ హెచ్చరించారు. 

click me!