ఆందోళనలకు కౌంటర్: వైఎస్ జగన్ తో అమరావతి రైతుల భేటీ

By telugu team  |  First Published Feb 4, 2020, 5:28 PM IST

అమరావతి రైతులు మంగళవారంనాడు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించాలని జగన్ సూచించినట్లు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు.


అమరావతి: ఆమరావతి రైతుల ఆందోళనలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కౌంటర్ ఇస్తున్నట్లే కనిపిస్తున్నారు. మంగళవారంనాడు అమరావతి రైతులు సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిశారు. తమ సమస్యలను వారు జగన్ కు వివరించారు. 

శాసనసభ్యుడు రామకృష్ణా రెడ్డి (ఆర్కే), ఉండవల్లి శ్రీదేవిలతో కలిసి రైతులు జగన్ వద్దకు వచ్చారు. సమావేశానంతరం ఆర్కే మీడియాతో మాట్లాడారు. అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించాలని జగన్ చెప్పినట్లు ఆయన తెలిపారు. రాజధాని రైతుల విజ్ఞప్తులను పరిశీలించి, వారి సమస్యలను పరిష్కరించాలని జగన్ చెప్పినట్లు ఆయన చెప్పారు.

Latest Videos

రాజధాని రైతులు సంతోషంగా ఉండాలని జగన్ అన్నట్లు ఆర్కే తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే గతంలో భూములను సేకరించారని రైతులు చెప్పినట్లు ఆయన తెలిపారు రిజర్వ్ జోన్లను కూడా ఎత్తేస్తామని జగన్ రైతులకు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.  రాజధాని రైతులకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్యాయం చేశారని చెప్పారు.

అమరావతి నుంచి రాజధానిని తరలివద్దంటూ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పాలనా వికేంద్రీకరణలో భాగంగా న్యాయ రాజధానని కర్నూలుకు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను విశాఖకు తరలించి, శాసనసభను మాత్రం అమరావతిలో ఉంచాలని జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారు.

రాజధాని రైతులకు కౌలు పెంచినందుకు సీఎంకు ధన్యవాదాలు ఆర్కే తెలిపారు.బలవంతపు భూసేకరణ నుంచి తమ గ్రామాలకు మినహాయింపు ఇవ్వాలని రైతులు కోరారని చెప్పారు. వారం , పది రోజుల్లో భూసేకరణ ఆదేశాలను ఉపసంహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

మంగళగిరి, తాడికొండలో బలవంతంగా 5వేల ఎకరాల భూ సేకరణ చేసిన  ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాజధానిని తరలించడం లేదని. . పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల్లో అభివృద్ది చేస్తున్నట్లు సీఎం చెప్పారు. తాడేపల్లి,  మంగళగిరి పట్టణాల  తరహాలో  గ్రామాలను అభివృద్ది చేయాలని రైతులు సిఎంను కోరారు.

click me!