గుడివాడలో ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్ర.. వైసీపీ శ్రేణుల నినాదాలు, ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Sep 24, 2022, 05:30 PM IST
గుడివాడలో ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్ర.. వైసీపీ శ్రేణుల నినాదాలు, ఉద్రిక్తత

సారాంశం

కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అమరావతి రైతులు, వైసీపీ నేతలు పోటాపోటీ నినాదాలు చేయడంతో హైటెన్షన్ నెలకొంది. 

కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అమరావతి రైతులు, వైసీపీ నేతలు పోటాపోటీ నినాదాలు చేయడంతో హైటెన్షన్ నెలకొంది. అమరావతి రైతుల పాదయాత్ర కాసేపటి క్రితం గుడివాడ శరత్ టాకీస్ వరకు చేరుకుంది. అదే సమయంలో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు రైతులు. శరత్ టాకీస్ వద్ద వున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు.. అమరావతి రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాసేపటి వరకు ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల వారికి నచ్చజెప్పారు. 

మరోవైపు కట్టుదిట్టమైన భద్రత మధ్య రైతుల పాదయాత్ర జరుగుతోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బైక్‌పై గుడివాడ చేరుకున్నారు. అటు మరో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గుడివాడ వెళ్తారన్న వార్తల నేపథ్యంలో ఏలూరులోని ఆయన నివాసం వద్దకు భారీగా పోలీసులు మోహరించారు. 
 

PREV
click me!

Recommended Stories

YS Jagan On Seediri Appalraju Son Issue | YS Jagan Press Meet | Asianet News Telugu
బాబు పాలనలో గంజాయికి గిట్టుబాటు ధర బాగుంది: YS Jagan | Asianet News Telugu