ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 19, 2024, 9:51 PM IST
Highlights

ఆళ్లగడ్డలో కాంగ్రెస్ ఐదు సార్లు , టీడీపీ ఆరు సార్లు, వైసీపీ నాలుగు సార్లు, ఇతరులు ఐదు సార్లు విజయం సాధించారు. భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఆళ్లగడ్డ కంచుకోట. భూమా అంటే ఆళ్లగడ్డ.. ఆళ్లగడ్డ అంటే భూమా అన్నట్లుగా సాగుతాయి వ్యవహారాలు. 1989 నుంచి ఇక్కడ 8 సార్లు ఎన్నికలు జరిగే భూమా నాగిరెడ్డి కుటుంబమే ఏడు సార్లు విజయం సాధించింది. దశాబ్ధాలుగా భూమా, గంగుల కుటుంబాలు ఆళ్లగడ్డపై ఆధిపత్యం కోసం తలపడుతున్నాయి. వీరి కుటుంబాల్లో ఎంతో మంది ఫ్యాక్షన్ రాజకీయాలకు బలయ్యారు.  ప్రస్తుతం భూమా, గంగుల వారసులు అఖిలప్రియ.. బ్రిజేంద్ర రెడ్డిలు తలపడుతున్నారు. 

ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పేరు చెప్పగానే ఫ్యాక్షన్ రాజకీయాలు కళ్లెదెట మెదులుతాయి. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఆళ్లగడ్డ కంచుకోట. భూమా అంటే ఆళ్లగడ్డ.. ఆళ్లగడ్డ అంటే భూమా అన్నట్లుగా సాగుతాయి వ్యవహారాలు. 1989 నుంచి ఇక్కడ 8 సార్లు ఎన్నికలు జరిగే భూమా నాగిరెడ్డి కుటుంబమే ఏడు సార్లు విజయం సాధించింది. భూమా శేఖర్ రెడ్డి, భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియలు ఆళ్లగడ్డ నుంచి గెలిచారు. భూమాతో పాటే గంగుల కుటుంబం కూడా ఈ నియోజకవర్గంలో రాజకీయాలను శాసించింది. గంగుల తిమ్మారెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి, గంగుల బ్రిజేంద్ర రెడ్డిలు ఆరు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దశాబ్ధాలుగా భూమా, గంగుల కుటుంబాలు ఆళ్లగడ్డపై ఆధిపత్యం కోసం తలపడుతున్నాయి. వీరి కుటుంబాల్లో ఎంతో మంది ఫ్యాక్షన్ రాజకీయాలకు బలయ్యారు. 

ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. భూమా, గంగుల కుటుంబాలదే ఆధిపత్యం :

ఆళ్లగడ్డలో కాంగ్రెస్ ఐదు సార్లు , టీడీపీ ఆరు సార్లు, వైసీపీ నాలుగు సార్లు, ఇతరులు ఐదు సార్లు విజయం సాధించారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,31,473 మంది. ఈ సెగ్మెంట్ పరిధిలో సిర్వెల్, ఆళ్లగడ్డ, డొర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం మండలాలున్నాయి. ఇక్కడ తొలి నుంచి రెడ్డి సామాజికవర్గానిదే ఆధిపత్యం. పార్టీ ఏదైనా గెలిచేది రెడ్లే. ప్రస్తుతం భూమా, గంగుల వారసులు అఖిలప్రియ.. బ్రిజేంద్ర రెడ్డిలు తలపడుతున్నారు.

తల్లిదండ్రుల మరణాలతో అఖిలప్రియ చిన్న వయసులోనే రాజకీయంగా ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా తట్టుకుని నిలబడి వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి గంగుల బ్రిజేంద్ర రెడ్డికి 1,05,905 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి భూమా అఖిలప్రియకు 70,292 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 35,613 ఓట్ల మెజారిటీతో ఆళ్లగడ్డలో విజయం సాధించింది.

ఆళ్లగడ్డ శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. జెండా ఎగురవేయాలని టీడీపీ :

వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డపై మరోసారి జెండా ఎగురవేసేందుకు గంగుల కుటుంబం పట్టుదలతో వుంది. జగన్ చరిష్మా, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి ధీమాతో వున్నారు. టీడీపీ విషయానికి వస్తే.. అఖిలప్రియకు చంద్రబాబు టికెట్ కేటాయించారు. విపక్షంలో వుండగా పోరాటాలు, టీడీపీ జనసేన బీజేపీ కూటమి , భూమా బ్రాండ్ తనను గెలిపిస్తాయని అఖిలప్రియ ఆకాంక్షిస్తున్నారు. అయితే సన్నిహితుల నుంచి ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డితో పాటు సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డితో వైరం అఖిలప్రియకు చేటు చేస్తాయన్న చర్చ జరుగుతోంది. 
 

click me!