ఇంటికి వెళ్లి గర్భిణీ స్త్రీకి చెక్: ఆళ్ల నాని, రమేష్ ఆస్పత్రిపై తీవ్ర వ్యాఖ్యలు (వీడియో)

By telugu teamFirst Published Aug 25, 2020, 11:11 AM IST
Highlights

రమేష్ ఆస్పత్రిలో ఆధ్వర్యంలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ఇతర మంత్రులతో కలిసి ఆళ్ల నాని చెక్ లు అందజేశారు.

విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు యాభై లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం  చెక్ లు అందజేసింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రులు ఆళ్ల నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొన్నారు.

రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడిచిన స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగిందని, వాళ్ల బాధ్యతారాహిత్యం వల్ల పది మంది చనిపోగా, 20మంది గాయపడ్డారని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఇంటి పెద్దలు చనిపోడంతో .. కుటుంబాలకు ఆదరణ లేకుండా పోయిందని, సిఎం జగన్ మానవత్వంతో మృతుల కుటుంబ సభ్యలకు యాభై లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారని ఆయన చెప్పారు.ఈరోజు ఒక్కొక్కరికీ యాభై లక్షల చొప్పున చెక్ లు అంద చేశామని, విజయవాడలో ఆరుగురికి, మచిలీపట్నం లో ముగ్గురికి ఇచ్చామని ఆయన చెప్పారు. కందుకూరు భర్తను కోల్పోయిన నిండు గర్బిణి గా ఉన్న ఆమె ఇంటికి వెళ్ళి చెక్ అందిస్తారని ఆయన చెప్పారు. 

ఈ ప్రమాద ఘటన తో ప్రైవేటు ఆస్పత్రి లు తీరు మార్చుకోవాలని సూచించారు. డబ్బే ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోవిడ్ వైద్యానికి సంబంధించి రమేష్ ఆసుపత్రికి అన్ని అనుమతులు రద్దు చేశామని, ఆస్పత్రి పెద్దలు కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ పిటీషన్లు వేస్తున్నారని ఆయన అన్నారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా, అధిక ఫీజులు కూడా వసూలు చేసినట్లు విచారణలో తేలిందని, వారికి నోటీసులు కూడా ఇచ్చామని ఆయన చెప్పారు. 30వ తేదీ తరువాత వారి జవాబును బట్టి ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని ఆళ్ల నాని చెప్పారు.

కోర్టులో కేసు నడుస్తున్నందున, ఆ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని ఆసుపత్రులను ఒకే గాటన కట్టలేమని, అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే విచారిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడి మరణిస్తున్నారని చెప్పారు. సమాచార శాఖ మంత్రి పేర్ని నాని కూడా సిఎం జగన్ దృష్టి కి తెచ్చారని, అన్ని పరిశీలించి త్వరలోనే సాయం అందించేలా చూస్తామని ఆళ్ల నాని చెప్పారు.

"

click me!