మద్యం మత్తులో దారుణం..రూ.500కోసం భార్యను చంపిన భర్త

Published : Aug 19, 2018, 10:47 AM ISTUpdated : Sep 09, 2018, 12:54 PM IST
మద్యం మత్తులో దారుణం..రూ.500కోసం భార్యను చంపిన భర్త

సారాంశం

ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా ఆడవారిపై ఆగడాలు మాత్రం ఆగడం లేదు. జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్త మద్యం మత్తులో అర్థాంతరంగా చంపేశాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కత్తితో గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన తాడేపల్లిలోని ప్రకాష్‌నగర్‌ క్వారీ వద్ద చోటు చేసుకుంది.

తాడేపల్లి: ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా ఆడవారిపై ఆగడాలు మాత్రం ఆగడం లేదు. జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్త మద్యం మత్తులో అర్థాంతరంగా చంపేశాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కత్తితో గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన తాడేపల్లిలోని ప్రకాష్‌నగర్‌ క్వారీ వద్ద చోటు చేసుకుంది. 

ప్రకాష్‌నగర్‌ క్వారీకి చెందిన కిరణ్‌, దేవమణి భార్యాభర్తలు. కిరణ్ టైల్స్‌ వేసే పనులు చేస్తుండగా దేవమణి పాల కేంద్రంలో పనిచేస్తుంది. అయితే   దేవమణిని తన భర్త కిరణ్  రూ.500లు ఇవ్వాలని కోరాడు. ఆమె తన వద్ద లేవని చెప్పింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్నకిరణ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఒక్కసారిగా విచక్షణ కోల్పోయి ఇంట్లో ఉన్నకత్తితో ఆమెపై దాడి చేసి గొంతు కోశాడు. గాయాలతో కొట్టుమిట్లాడుతున్న తల్లిని చూసిన కుమారులు కేకలు వేయడంతో స్థానికులు వచ్చేసరికి కిరణ్ పరరాయ్యాడు. 

బాధితురాలిని 108లో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తరచూ మద్యం తాగేందుకు డబ్బుల కోసం భర్త వేధిస్తుంటాడని బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడిని పట్టుకునేందుక గాలింపు చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Lokesh Motivate Speech: బ్రాహ్మణి అర్థం చేసుకుంటేనే నేను రోడ్లమీద తిరుగుతున్నా | Asianet News Telugu
Minister Nara Lokesh Speech: బాలయ్య డైలాగులతో రెచ్చిపోయిన నారాలోకేష్. ఇక సమరమే | Asianet News Telugu