పవన్ కల్యాణ్ కు మరో దెబ్బ: సొంత గూటికి జనసేన నేత

Published : Jun 20, 2019, 06:31 PM IST
పవన్ కల్యాణ్ కు మరో దెబ్బ: సొంత గూటికి జనసేన నేత

సారాంశం

ఓటమిపై నేతలు అధైర్యపడవద్దని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ నేతలకు సూచించినా ఫలితం ఉండడం లేదు.తాజాగా  ఆ పార్టీ సీనియర్‌ నేత ఆకుల సత్యనారాయణ జనసేను వీడనున్నారు. తిరిగి ఆయన తన సొంతగూటికి చేరుకోనున్నారు. తిరిగి బిజెపిలో చేరబోతున్నారు.

అమరావతి: ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దెబ్బ తగలబోతోంది. శాసనసభ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న జనసేనను వీడేందుకు ఓ సీనియర్ నేత సిద్ధపడ్డారు. 

ఓటమిపై నేతలు అధైర్యపడవద్దని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ నేతలకు సూచించినా ఫలితం ఉండడం లేదు.తాజాగా  ఆ పార్టీ సీనియర్‌ నేత ఆకుల సత్యనారాయణ జనసేను వీడనున్నారు. తిరిగి ఆయన తన సొంతగూటికి చేరుకోనున్నారు. తిరిగి బిజెపిలో చేరబోతున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి లోకసభ స్థానం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ మధ్య రావెల కిషోర్‌ బాబు కూడా జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Bhogapuram Airport : ఆంధ్ర ప్రదేశ్ పై ప్రధాని వరాలు... కేంద్రం ఏమేం చేస్తుందో చెప్పిన నరేంద్ర మోదీ
Farmers Scheme : తెలుగు రైతులకు బంపర్ ఆఫర్.. అకౌంట్లోకి నేరుగా రూ.30,000, సర్కార్ సూపర్ స్కీమ్