సీఎం జగన్ ను కలిసిన అజేయ్ కల్లం

By Nagaraju penumalaFirst Published Jun 5, 2019, 2:55 PM IST
Highlights

ప్రభుత్వ సలహాదారులతోపాటు రాష్ట్రంలో ఏ శాఖకు చెందిన అధికారినైనా పిలిచి సలహాలు ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వం ఆయనకు కల్పించింది. సీఎం ముఖ్యసలహాదారుగా అజేయ్ కల్లం మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇకపోతే గత ప్రభుత్వంలో అజేయ్ కల్లం కీలక పదవులు నిర్వహించారు. 
 
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ్ కల్లాం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్డ్ అయిన అజేయ్ కల్లాంకు కేబినెట్‌ హోదాతో సీఎం ముఖ్య సలహాదారుగా నియమించారు వైయస్ జగన్. 

ముఖ్యమంత్రి కార్యాలయం అధిపతిగా అజేయ్ కల్లం వ్యవహరించనున్నారు. కేబినెట్ హోదాతో కూడిన ప్రభుత్వ ముఖ్యసలహాదారుగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంవో కార్యదర్శులకు శాఖలను కేటాయించే బాధ్యతపై జగన్ ఆయనతో చర్చించారు. 

ప్రభుత్వ సలహాదారులతోపాటు రాష్ట్రంలో ఏ శాఖకు చెందిన అధికారినైనా పిలిచి సలహాలు ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వం ఆయనకు కల్పించింది. సీఎం ముఖ్యసలహాదారుగా అజేయ్ కల్లం మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇకపోతే గత ప్రభుత్వంలో అజేయ్ కల్లం కీలక పదవులు నిర్వహించారు. 

టీటీడీ కార్య నిర్వహణ అధికారిగా, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ చైర్మన్ గా, ఆర్థిక శాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో అమరావతిలో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తప్పుబట్టి సంగతి తెలిసిందే.  

click me!